Pushpa Movie: రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రిలీజ్.. శ్రీవల్లిగా...

Pushpa Movie: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న సినిమా పుష్ప.

Update: 2021-09-29 07:22 GMT

Pushpa Movie: రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రిలీజ్.. శ్రీవల్లిగా...

Pushpa Movie: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న సినిమా పుష్ప. రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ఈ సినిమా లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. అయితే తాజాగా పుష్ప నుంచి ఓ అదిరిపోయే అప్‌డేట్‌ వచ్చింది. నేడు రష్మిక మందన్నా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం.

ఇక ఈ పోస్టర్ చూసినట్టైతే రష్మిక పూర్తి డీ గ్లామర్ రోల్ పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో రష్మిక శ్రీవల్లి అనే పాత్రలో నటిస్తున్నట్టు తాజా పోస్టర్‌తో వెల్లడించారు. అద్దం ముందు కూర్చొని చెవులకి కమ్మలు పెట్టుకుంటున్నట్టుగా చూపించిన ఈ పోస్టర్‌లో చీర, పూలతో అలంకరించుకొని ఎక్కడికో వెళ్ళబోతున్నట్టు రష్మిక కనిపిస్తోంది. ప్రస్తుతం ఆమె లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ నెలలో విడుదలకానుంది.


Tags:    

Similar News