రష్మీక మందన్న నే సినిమా హీరో అంటున్న డైరెక్టర్

*రష్మీక మందన్న నే సినిమా హీరో అంటున్న డైరెక్టర్

Update: 2022-05-04 06:46 GMT

రష్మీక మందన్న నే సినిమా హీరో అంటున్న డైరెక్టర్

Rashmika Mandanna: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్ లలో రష్మిక మందన్న కూడా ఒకరు. టాలీవుడ్ లో మాత్రమే కాక మరోవైపు బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో కూడా రష్మిక కి చేతినిండా ప్రాజెక్టులు ఉన్నాయి. తాజాగా తెలుగు లో దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో "సీతారామన్"అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది రష్మిక.

మలయాళం నటుడు దుల్కర్ సల్మాన్ ఈ సినిమాతో తెలుగులో కూడా అడుగు పెట్టబోతున్నారు. ఈ సినిమా ఒక యుద్ధం బాక్ డ్రాప్ లో జరిగే కథ అని, దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలో ఒక సైనికుడి పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. మృణాల్ తాకుర్ మరియు రష్మిక మందన్న ఈ సినిమాలో హీరయిన్లుగా నటిస్తున్నారు. రష్మిక ఈ సినిమాలో అఫ్రీన్ అనే ఒక కాశ్మీరీ ముస్లిం పాత్రలో కనిపించబోతోందట. తాజాగా విడుదలైన ఈమె లుక్ పోస్టర్ కి మంచి ఆదరణ లభించింది.

ఈ సినిమా కోసం రష్మిక మందన్న చాలా కష్టపడింది అని, తన పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేయటం కోసం బోలెడు వీడియో చూసిందని, ఈ సినిమా తన కెరీర్ లో బెస్ట్ సినిమా అవుతుందని అన్నారు హను. అలాగే ఈ సినిమా లో రష్మిక కు లోతైన పాత్ర దొరికిందని, అసలు ఈ సినిమాకి రష్మీక నే హీరో అని అన్నారు హను రాఘవపూడి.

Tags:    

Similar News