Rashmika Mandanna: తళపతి విజయ్ తో రొమాన్స్ చేయనున్న రష్మిక మందన్న
Rashmika Mandanna: ఇప్పటికే ఈ సినిమా హీరోయిన్ కోసం వంశీ పైడిపల్లి ఒక మంచి కథను రాసుకున్నారట...
Rashmika Mandanna: తళపతి విజయ్ తో రొమాన్స్ చేయనున్న రష్మిక మందన్న
Rashmika Mandanna: కోలీవుడ్ స్టార్ హీరో తళపతి విజయ్ త్వరలోనే టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో కలిసి ఒక స్ట్రయిట్ తెలుగు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా గురించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం స్టార్ బ్యూటీ రష్మిక మందన్న అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా హీరోయిన్ కోసం వంశీ పైడిపల్లి ఒక మంచి కథను రాసుకున్నారట. ఇక సినిమాలో హీరోయిన్ పాత్రలో రష్మిక మందన్నా అయితే చాలా బాగుంటుందని వంశీ పైడిపల్లి ఆమెను సంప్రదించగా, రష్మిక మందన్న కూడా వెంటనే ఒప్పుకుంది అని తెలుస్తోంది. మరోవైపు రష్మిక మందన్న ఎమ్మధ్యనే అల్లు అర్జున్ సరసన నటించిన "పుష్ప: ది రైజ్" సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.
ప్రస్తుతం హిందీ లో రెండు సినిమాలు చేస్తున్న రష్మీక తెలుగులో "పుష్ప: ది రూల్" తో బిజీగా ఉంది. ఇక విజయ్ సినిమాలో రష్మీక ప్రత్ర గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.