Rashmi gautam First Look : పోతురాజు లవర్ గా రష్మీ.. ఫస్ట్ లుక్ జబర్దస్త్!
Rashmi gautam First Look : జబర్దస్త్ తో పాటుగా పలు షోలలో మెరుస్తూ బుల్లితెర పై ఆదరగొడుతున్న యాంకర్ రష్మీ గౌతమ్ అవకాశాలు
rashmi gautam first look released from bomma block buster movie
Rashmi gautam First Look : జబర్దస్త్ తో పాటుగా పలు షోలలో మెరుస్తూ బుల్లితెర పై ఆదరగొడుతున్న యాంకర్ రష్మీ గౌతమ్ అవకాశాలు వచ్చినప్పుడు వెండితెరపై కూడా కనిపిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. తాజాగా తను బొమ్మ బ్లాక్ బస్టర్ అనే చిత్రంలో నటిస్తుంది.. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ప్రేక్షకులని ఆకట్టుకుంది. తాజాగా మూవీ నుంచి తన లుక్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది రష్మీ. ఈ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.
ఇందులో ఆమె తలపై కిరీటం పెట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ డిఫరెంట్ లుక్ లో కనిపించి సూపర్బ్ అనిపించింది .. ఆమె లుక్ పట్ల అభిమానూలు కూడా వావ్ అని కామెంట్ చేస్తున్నారు.. ఇందులో రష్మీ పోతురాజు గాడి లవర్ వాణి అనే పాత్రలో కనిపిస్తుంది.. ఇక ఈ చిత్రంలో నందు హీరోగా పోతురాజు పాత్రలో నటిస్తున్నాడు.. ఇందులో నందు పూరి జగన్నాథ్ అభిమానిగా కనిపించనున్నాడు..
విజయీభవ ఆర్ట్స్ పతాకంపై ప్రవీణ్ పగడాల, బోస్ బాబు నిడిమోలు, ఆనంద్ రెడ్డి నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా, రాజ్ విరాఠ్ దర్శకత్వం వహిస్తున్నాడు. చూడాలి మరి రష్మీకి ఈ సినిమా ఏ మేరకు విజయాన్ని ఇస్తుందో..
#Vaani pic.twitter.com/H6VqYQhKmP
— rashmi gautam (@rashmigautam27) September 9, 2020