రానాకు ఏమైంది.. అనారోగ్యంగా ఉన్నారా?

రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమాలో బల్లాలదేవుడి పాత్రలో తనకంటూ ప్రత్యేక క్రేజ్ తెచ్చుకున్నారు రానా. అయితే ఆయన గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. చివరి సారిగా ఎన్టీఆర్ చిత్రంలో మాజీ సీఎం చంద్రబాబు పాత్రలో నటించి మెప్పించారు.

Update: 2019-10-02 06:58 GMT

రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమాలో బల్లాలదేవుడి పాత్రలో తనకంటూ ప్రత్యేక క్రేజ్ తెచ్చుకున్నారు రానా. అయితే ఆయన గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. చివరి సారిగా ఎన్టీఆర్ చిత్రంలో మాజీ సీఎం చంద్రబాబు పాత్రలో నటించి మెప్పించారు.

రానా ఆనారోగ్యంగా ఉన్నాడని సోషన్ మీడియాలో ప్రచారం సాగింది. అయితే ఇలాంటి వార్తలను ఖండించారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని రానా తన ఫోటోను ఇన్‎స్టా వేదికగా షేర్ చేసారు. ఈ ఫోటోలో ఆయన చాలా సన్నగా ఉన్నారు. దీంతో ఆయన అభిమానులు , నెటిజన్లు రానా మీరు ఆరోగ్యంగానే ఉన్నారనుకుంటున్నాను, ఏమైంది ఇలా సన్నగా ఉన్నావ్, అనారోగ్యంగా కనిపిస్తున్నారు, అంటూ ఆందోళనలను కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు. ప్రస్తుతం రానా విరాటపర్వం చిత్రంలో నటిస్తున్నారు. ఆయన నటించిన మరో చిత్రం హౌస్‎ఫూల్ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 

Tags:    

Similar News