డిజాస్టర్ గా మారిపోతున్న రామ్ సినిమా

Ram Movie: భారీగా తగ్గిపోయిన "ది వారియర్" కలెక్షన్లు

Update: 2022-07-17 03:08 GMT

డిజాస్టర్ గా మారిపోతున్న రామ్ సినిమా 

Ram Movie: ఈ మధ్యనే "ఇస్మార్ట్ శంకర్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న హీరో రామ్ "రెడ్" సినిమాతో అంతగా మెప్పించలేకపోయింది. తాజాగా ఇప్పుడు తమిళ్ డైరెక్టర్ ఎన్ లింగు స్వామి దర్శకత్వంలో "ది వారియర్" సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమాలో హీరో ఆది పినిశెట్టి మెయిన్ విలన్ పాత్రలో కనిపించారు. "ఉప్పెన" బ్యూటీ కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా అక్షర గౌడ మరియు నదియ ముఖ్య పాత్రలు పోషించారు. మంచి అంచనాల మధ్య ఈ సినిమా జులై 14 న థియేటర్లలో విడుదలైంది.

థియేట్రికల్ రైట్స్ తో 35 కోట్ల వరకు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ను చేసింది. కానీ మొదటి రోజు నుంచి సినిమా కలెక్షన్లు అంతంత మాత్రం గానే ఉన్నాయి. విడుదలైన మొదటి రోజు కేవలం 6 కోట్లు మాత్రమే వసూలు చేసిన ఈ సినిమా 17% మాత్రమే వెనక్కి తీసుకురాగలిగింది. రెండవ రోజు సినిమా కలెక్షన్లు భారీగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా ఇప్పుడు ఈ సినిమా కలెక్షన్లు మరింతగా పడిపోయాయి. ఇక సినిమా ఫైనల్ రన్ పూర్తయ్యే లోపల కనీసం 50% రికవరీ అయినా ఉండకపోవచ్చు అని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. చూస్తూ ఉంటే "ది వారియర్" సినిమా రామ్ కరియర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ గా మారబోతోంది. ఇక మొదటి వారంతం తర్వాత సినిమా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందేమో చూడాలి.

Tags:    

Similar News