Rakul Preet Singh: ఆ ఘటన నుంచి ఇంకా కోలుకోలేదు.. రకుల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Rakul Preet Singh: 2011లో వచ్చిన కెరటం మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల తార రకుల్‌ ప్రీత్ సింగ్‌.

Update: 2025-03-31 04:52 GMT

Rakul Preet Singh: ఆ ఘటన నుంచి ఇంకా కోలుకోలేదు.. రకుల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Rakul Preet Singh: 2011లో వచ్చిన కెరటం మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల తార రకుల్‌ ప్రీత్ సింగ్‌. ఆ తర్వాత తమిళంలో పలు వరుస సినిమాల్లో నటించే అవకాశం అందుకుంది. అనంతరం 2013లో వచ్చిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ మూవీతో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక అప్పటి నుంచి తెలుగులో వరుస విజయాలను అందుకుంది.

బాలీవుడ్‌లో దాదాపు అందరూ యంగ్‌ స్టార్‌ హీరోల సరసన నటించిందీ చిన్నది. అయితే గత కొన్ని రోజులుగా రకుల్ సరైన విజయాన్ని అందుకోలేకపోయిందని చెప్పాలి. 2017లో వచ్చిన రారండోయ్‌ వేడుక చూద్దాం తర్వాత తెలుగులో మళ్లీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయిందీ బ్యూటీ. కాగా 2024లో ప్రియుడు జాకీ భగ్నానీని వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో కేవలం రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయి.

ఇదిలా ఉంటే గతేడాది అక్టోబర్‌లో జరిగిన ఓ ప్రమాదంకు సంబంధించిన విషయాన్ని రకుల్‌ పంచుకుంది. జిమ్‌లో వర్క్‌వుట్‌ చేస్తోన్న సమయంలో గాయం గురించి రకుల్‌ గుర్తు చేసుకుంది. 6 నెలలు గడిచినప్పటికీ దానినుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని తాజాగా రకుల్‌ చెప్పుకొచ్చారు. ఆ గాయం తనకు ఎన్నో విషయాలు నేర్పిందన్నారు. లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో పాల్గొన్న సందర్భంగా రకుల్ పలు విషయాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా రకుల్‌ మాట్లాడుతూ.. 'జిమ్‌లో జరిగిన గాయం నాకో ఎదురుదెబ్బ. ఇప్పటికీ సరైన స్థితిలోకి రాలేదు. అప్పటికంటే కాస్త మెరుగు అయినప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. చాలా విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తున్నాను. అన్నీ మనం అనుకున్నట్లే జరుగుతాయని అనుకున్నా ఒక్కోసారి కొన్ని విషయాల్లో ఆచితూచి అడుగులు వేయడం మంచిది. గాయాన్ని నేను మొదట నిర్లక్ష్యం చేశాను. చికిత్స తీసుకోవాలని నిర్ణయించుకునే సమయానికే దాని తీవ్రత ఎక్కువైంది. గాయం నుంచి కోలుకోవాలంటే చాలా రోజులు పడుతుందని వారం రోజులకు అర్థమైంది. ధైర్యంగా దాన్ని నుంచి కోలుకుంటున్నాను. నా వర్క్‌లో బిజీ అవుతున్నాను' అని చెప్పుకొచ్చింది. 

Tags:    

Similar News