Radhe Shyam: రాధేశ్యామ్ సినిమా కథ ఒక బయోపిక్ కానుందా?

Radhe Shyam: ప్రముఖ జ్యోతిష్కుడి జీవిత కథ ఆధారంగా రాధేశ్యామ్?

Update: 2021-10-27 10:52 GMT

Radhe Shyam: రాధేశ్యామ్ సినిమా కథ ఒక బయోపిక్ కానుందా?

Radhe Shyam: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా "రాధేశ్యామ్". ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ కు అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. వింటేజ్ ఫీల్ తో విడుదలైన టీజర్ ఈ సినిమా కచ్చితంగా మిగతా ప్రేమ కథలకి భిన్నంగా ఉంటుందని చెప్పకనే చెబుతోంది. "జిల్" ఫేమ్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఒక నిజజీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కనుందట. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కథ ప్రముఖ హస్తసాముద్రికుడు చేయిరో అలియాస్ విలియం జాన్ వార్నర్ జీవిత కథ కి దగ్గరగా ఉంటుందని తెలుస్తోంది.

1880 కాలంలో ఐరిష్ ఆస్ట్రాలజర్ అయిన చెయిరో చాలా పాప్యులర్. అప్పట్లో చాలా మంది రాజుల చావులని మరియు ప్రపంచం లో జరగబోయే చాలా సంఘటనలను ముందుగానే జ్యోతిష్యం చెప్పిన చేయిరో మీద ఇప్పటికే చాలా సినిమాలు విడుదలయ్యాయి. అయితే "రాధే శ్యామ్" సినిమా ద్వారా ఈ ప్రముఖ హస్తసాముద్రికుడు జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన మరియు ఎవరికీ తెలియని విషయాలను సినిమాలో చూపించబోతున్నారట. అయితే సినిమా కథ గురించి దర్శక నిర్మాతలు సైలెన్స్ మైంటైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ మరియు టీ సిరీస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Tags:    

Similar News