Radhe Shyam Teaser News: ప్రభాస్ పుట్టినరోజు కానుకగా "రాధేశ్యామ్" టీజర్..??

* ప్రభాస్ పుట్టినరోజు కానుకగా "రాధేశ్యామ్" చిత్ర యూనిట్ టీజర్ విడుదల చేసే ఛాన్స్

Update: 2021-10-13 11:00 GMT

Radhe Shyam Teaser News: ప్రభాస్ పుట్టినరోజు కానుకగా "రాధేశ్యామ్" టీజర్..??

Radhe Shyam Teaser News: తెలుగు సినిమా పరిశ్రమలో దర్శకుడిగా "ప్రయాణం" మొదలుపెట్టి ఎంతో "సాహసం"తో విభిన్నకథలతో తెలుగు ప్రేక్షకులకు మంచి సినిమాలను అందజేస్తూ ఇండస్ట్రీలో "జిల్" ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాధాకృష్ణ కుమార్ త్వరలో "రాధేశ్యామ్" సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రభాస్ - పూజ హెగ్దే జంటగా నటించిన ప్యాన్ ఇండియా సినిమా "రాధేశ్యామ్"కి దర్శకత్వం వహించిన రాధాకృష్ణ ఈ సినిమాని పూర్తిచేసి ప్రస్తుతం డబ్బింగ్ పనుల్లో బిజీబిజీగా గడుపుతున్నట్లు సమాచారం.

తాజాగా బుధవారం ఈ సినిమా హీరోయిన్ పూజ హెగ్దే పుట్టినరోజు సందర్భంగా ఆమెకి శుభాకాంక్షలు చెబుతూ పోస్టర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. అయితే ఇప్పటివరకు "రాధేశ్యామ్" సంబంధించి గ్లిమ్పాస్, ఫోటోలతోనే అభిమానులను నిరాశపరుస్తున్న చిత్ర యూనిట్ ఈ దసరాకైనా టీజర్ ని విడుదల చేస్తారేమో అనుకున్నా వారి ఆశలపై నీళ్ళు చల్లారు. ప్రస్తుతం సినీ వర్గాల సమాచారం ప్రకారం మరో పది రోజుల్లో అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు కానుకగా "రాధేశ్యామ్" టీజర్ ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.

మరి ఇన్ని రోజులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న డార్లింగ్ ఫ్యాన్స్ కి ప్రభాస్ పుట్టినరోజునైనా "రాధేశ్యామ్" టీజర్ తో సర్ప్రైస్ ఇవ్వనున్నాడో లేదో వేచిచూడాలి. ఇటలీ బ్యాక్ డ్రాప్ లో చిత్రీకరించిన ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో తెరకేక్కించింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Tags:    

Similar News