Pushpa: రష్యాలో తగ్గేదెలే.. ప్రచారానికి ఏకంగా ఐదు కోట్లు..

ప్రమోషన్ల కోసం ఐదు కోట్లు వెచ్చిస్తున్న పుష్ప బృందం

Update: 2022-12-09 16:00 GMT

Pushpa: రష్యాలో తగ్గేదెలే.. ప్రచారానికి ఏకంగా ఐదు కోట్లు..

Pushpa: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో నటించిన "పుష్ప: ది రైజ్" బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక అన్ని భాషల్లోనూ ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలనుకున్న దర్శక నిర్మాతలు రష్యాలో కూడా సినిమాని విడుదల చేయబోతున్నారు.

ఇప్పటికే ఈ సినిమా రష్యా వర్షన్ కి సంబంధించిన ట్రైలర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఒక తెలుగు సినిమా రష్యాలో ఇంత భారీ ఎత్తున విడుదల కావడం ఇదే మొదటిసారి. ఇక సినిమా ప్రమోషన్స్ కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్, మరియు చిత్ర బృందం కలిసి రష్యాకి వెళ్ళింది. అక్కడ సినిమాకి సంబంధించిన ప్రచారంలో పాల్గొన్నారు.

కేవలం రష్యాలో ప్రమోషన్స్ కోసం చిత్ర బృందం ఏకంగా ఐదు కోట్లు ఖర్చుపెట్టినట్టు తెలుస్తోంది. ఒక తెలుగు సినిమాని విదేశాల్లో ప్రచారం చేసుకోవడం ముఖ్యమే కానీ దానికోసం ఇంత భారీ మొత్తాన్ని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదేమోనని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే రష్యాలో తెలుగు సినిమాలు పెద్దగా ఆడిన దాఖలాలు లేవు. ఇక ప్రస్తుతం "పుష్ప" ప్రమోషన్ల కోసం ఖర్చుపెట్టిన అమౌంట్ తిరిగి వచ్చినా కూడా అది గొప్ప విషయం అని చెప్పుకోవాలి. మరి "పుష్ప" ఎంతవరకు రష్యా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

Tags:    

Similar News