Sharwanand Reveals టైటిల్ ఇచ్చారు.. పరువు నిలబెట్టావ్ అన్నారు": శర్వానంద్

సంక్రాంతి బ్లాక్ బస్టర్ ‘నారీ నారీ నడుమ మురారి’ సక్సెస్ మీట్‌లో శర్వానంద్ ఆసక్తికర వ్యాఖ్యలు. బాలయ్య బాబు తన పరువు నిలబెట్టావని మెచ్చుకున్నట్లు శర్వా వెల్లడించారు.

Update: 2026-01-22 10:14 GMT

1990లో బాలకృష్ణ హీరోగా వచ్చిన క్లాసిక్ హిట్ ‘నారీ నారీ నడుమ మురారి’ టైటిల్‌ను, మూడున్నర దశాబ్దాల తర్వాత శర్వానంద్ తన సినిమాకు వాడుకున్నారు. ఈ టైటిల్ వెనుక ఉన్న ముచ్చట్లను శర్వా ఇలా వివరించారు:

ముహూర్తం పెట్టింది ఆయనే!

"సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని అనుకున్నప్పుడు నేను, నిర్మాత అనిల్ సుంకర కలిసి బాలయ్య బాబుకు ఫోన్ చేశాం. ఆయన ఏమాత్రం ఆలోచించకుండా.. 'ఏయ్.. నన్ను అడగడం ఏంటి? నువ్వు నా వాడివి, తప్పకుండా పెట్టుకో' అని పెద్ద మనసుతో ఒప్పుకున్నారు. అంతేకాదు, ఆయనే స్వయంగా ముహూర్తం చూసి 'అన్‌స్టాపబుల్' షో వేదికగా టైటిల్ పోస్టర్‌ను లాంచ్ చేశారు." అని శర్వా తెలిపారు.

బాలయ్య నుంచి స్పెషల్ కాంప్లిమెంట్

సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయిన తర్వాత శర్వానంద్ బాలయ్యకు ఫోన్ చేయగా, ఆయన స్పందన చూసి శర్వా ఫిదా అయిపోయారట.

"నేను బాలయ్య బాబుకు ఫోన్ చేసి థ్యాంక్స్ చెబితే, ఆయన నాతో.. 'ఏయ్ విన్నాను.. సినిమా అదిరిపోయింది. నా పరువు నిలబెట్టావ్. నీకే నేను థ్యాంక్స్ చెప్పాలి' అని అభినందించారు. ఒక లెజెండరీ హీరో నుంచి అలాంటి మాటలు రావడం నా అదృష్టం." - శర్వానంద్

ఇకపై ప్రతి సినిమాకూ ఆయనే గురువు!

బాలయ్య బాబు సెంటిమెంట్ వర్కవుట్ అవ్వడంతో, శర్వానంద్ ఆయనకు ఒక క్రేజీ రిక్వెస్ట్ పెట్టారట. "సార్.. ఇక నుంచి నా ప్రతి సినిమాకు ముహూర్తం మీరే పెట్టాలి" అని శర్వా అడగ్గా, బాలయ్య నవ్వుతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

సినిమా విశేషాలు:

దర్శకత్వం: రామ్ అబ్బరాజు

నిర్మాతలు: అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర (ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్)

హీరోయిన్లు: సంయుక్త మీనన్, సాక్షి వైద్య

విడుదల: జనవరి 14 (సంక్రాంతి విన్నర్)

Tags:    

Similar News