Pune Highway: నెట్‌ఫ్లిక్స్‌లో విజయం సాధిస్తున్న హిందీ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్

ఇటీవల థ్రిల్లర్ జానర్‌కి ఓటీటీ వేదికల్లో విశేష ఆదరణ లభిస్తోంది. ఆ కోవలో తాజాగా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ లో అదరగొడుతున్న హిందీ చిత్రం ‘పూణె హైవే’.

Update: 2025-07-07 15:30 GMT

Pune Highway: ఇటీవల థ్రిల్లర్ జానర్‌కి ఓటీటీ వేదికల్లో విశేష ఆదరణ లభిస్తోంది. ఆ కోవలో తాజాగా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ లో అదరగొడుతున్న హిందీ చిత్రం ‘పూణె హైవే’. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా మే 23న థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన అందుకున్నా, జూలై 4న ఓటీటీకి వచ్చాక మాత్రం అంచనాలు మించే స్పందన పొందుతోంది.

భార్గవ కృష్ణ - రాహుల్‌ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కథ ఒక యువతి మృతి చుట్టూ తిరుగుతుంది. ముంబయికి దూరంగా ఉన్న ఓ చెరువులో గుర్తుతెలియని మృతదేహం లభిస్తుంది. విచారణలో ఆమె పేరు మోనా అని తేలుతుంది. అయితే ఇది ఆత్మహత్యా లేక హత్యా అనే అనుమానంతో సీఐ ప్రభాకర్ విచారణ ప్రారంభిస్తాడు. అన్వేషణలో భాగంగా నాలుగు మంది స్నేహితులు ప్రధానంగా వెలుగులోకి వస్తారు.

ఆ నలుగురికి మోనాతో నిజంగా ఎలాంటి సంబంధం ఉంది? వాళ్లే హత్య చేశారు అనే అనుమానం ఎలా ఏర్పడుతుంది? మోనాతో జరిగిన ఈ ఘటన వారి జీవితాల్లో ఎలాంటి గందరగోళం సృష్టిస్తుంది? అనేది సినిమా మిగిలిన కథ. వేగంగా మారే మలుపులు, అనూహ్య సంఘటనలతో సినిమా నెట్టినట్లు ముందుకుపోతూ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటోంది.

ప్రస్తుతం ఈ చిత్రం హిందీ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే ఇతర భాషల్లో కూడా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. థ్రిల్లర్ ప్రేమికుల కోసం ఇది తప్పక చూడదగ్గ చిత్రంగా నిలుస్తోంది.


Tags:    

Similar News