Hari Hara Veera Mallu: ఫస్ట్ లుక్ రిలీజ్.. రచ్చ చేస్తున్న ఫ్యాన్స్

Hari Hara Veera Mallu: మహాశివరాత్రిన ఫ్యాన్స్ కి మెమరబుల్ ట్రీట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్.

Update: 2021-03-11 12:43 GMT
హరిహర వీరమల్లు ఫస్ట్ లుక్ (ఫొటో ట్విట్టర్)

Hari Hara Veera Mallu: మహాశివరాత్రి రోజున ఫ్యాన్స్ కి మెమరబుల్ ట్రీట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. క్రియేటివ్‌ డైరెక్టర్ క్రిష్‌ దర్శకత్వంలో రాబిన్‌హుడ్‌ తరహా పాత్రలో ఆయన నటించిన చిత్ర ఫస్ట్ లుక్‌ నేడు విడుదల చేశారు. ఈమేరకు సోషల్‌ మీడియాలో పవన్‌ అభిమానుల హడావుడి కొనసాగుతూనే ఉంది. ట్రెండింగ్‌లో సంచలనాలను క్రియేట్‌ చేస్తూనే ఉంది. ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్‌ బ్యానర్‌పై ఏఎమ్‌ రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 'హరిహర వీరమల్లు' అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కతోన్న ఈ చిత్రం రాబోయే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఫస్ట్‌ లుక్‌ చూస్తుంటే.. పీరియాడికల్‌ నేపథ్యంలో ఫాంటసీ చిత్రంగా రూపొందుతున్నట్లుగా సమాచారం. ఇలాంటి లుక్‌తో పవన్‌ కల్యాణ్‌ ఇంత వరకు నటించలేదు. పీరియాడికల్‌ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఔరంగజేబు కాలం నాటి కట్టడాలన్నింటిని చూపించేందుకు క్రిష్‌ ఓ కంచుకోటనిక కూడా సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఫస్ట్ లుక్‌తోనే ట్రెండింగ్‌లో ఓ ఆటాడేస్తున్నాడీ 'హరిహర వీరమల్లు'.

Full View


Tags:    

Similar News