SSMB29: రాజమౌళి సినిమాలో మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్.. వైరల్ అవుతున్న పోస్ట్
మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో SSMB29 వర్కింగ్ టైటిల్‌తో ఓ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకే ఏ చిన్న వార్త తెలిసినా అది క్షణాల్లో వైరల్ అవుతోంది
రాజమౌళి సినిమాలో మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్.. వైరల్ అవుతున్న పోస్ట్
SSMB29: మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో SSMB29 వర్కింగ్ టైటిల్‌తో ఓ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకే ఏ చిన్న వార్త తెలిసినా అది క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా పృథ్వీరాజ్ సుకుమారన్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. పృథ్వీరాజ్ పోస్టుతో తాజాగా ఈ చిత్రం మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇంతకీ పృథ్వీరాజ్ పెట్టిన పోస్ట్ ఏంటో చూద్దాం.
తాజాగా పృథ్వీరాజ్ తన ఇన్ స్టాలో ఓ పోస్టు పెట్టారు. అయితే SSMB29ను ఉద్దేశించి దాన్ని పెట్టారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దర్శకుడిగా నా చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తి చేశాను. వాటికి సంబంధించిన మార్కెటింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. నటుడిగా తెరపై కనిపించడానికి సిద్ధమవుతున్నా. పరభాష చిత్రంలో కనిపించనున్నా. అందులో పెద్ద డైలాగులు ఉన్నాయని తెలిసి కాస్త భయపడుతున్నా అని తన పోస్టులో రాసుకొచ్చారు. దీంతో పృథ్వీ SSMB29 కోసం తన ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. SSMB29 ప్రాజెక్టులో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించనున్నట్టు ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి.
గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పృథ్వీరాజ్ తాను రాజమౌళి, మహేష్ ప్రాజెక్టులో నటిస్తున్నట్టు వస్తున్న రూమర్స్ స్పందించారు. తన కంటే ముందే అందరికీ విషయాలు తెలిసిపోతున్నాయన్నారు. అయితే దీనిపై ఇంకా స్పష్టత రాలేదని.. చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. అవి ఫైనల్ అయ్యాక వాటి గురించి మాట్లాడుకుందామన్నారు. ప్రస్తుతం పృథ్వీరాజ్ పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. అది చూసిన నెటిజన్లు తాను SSMB29లో నటించడం కన్ఫార్మ్ అయిందని చర్చించుకుంటున్నారు.
SSMB29 ప్రాజెక్ట్ ఆఫ్రికా అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్‌గా ప్రపంచాన్ని చుట్టేసే ఓ సాహస ప్రయాణంగా రూపొందుతోందని తెలుస్తోంది. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్‌తో హాలీవుడ్ రేంజ్‌లో సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మహేష్ బాబు న్యూ లుక్‌లో కనిపించనుండగా.. ఇటీవల ఆయన జిమ్‌లో వర్కౌట్ చేస్తోన్న వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రియాంక చోప్రా ఈ సినిమాలో నెగిటివ్ రోల్‌లో కనిపించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. హీరోతో పాటు ప్రియాంక రోల్‌కు కూడా అత్యంత ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది.