Prakash Raj: డైలాగ్‌లు చెప్పడం కాదు ప్రజల కోసం పని చేయాలి.. పవన్‌కు ప్రకాశ్‌ రాజ్ పంచ్‌

Prakash Raj: ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జాతీయ అవార్డులు, రాజకీయాలు, సమాజంలో జరుగుతున్న వివిధ అంశాల గురించి మాట్లాడారు.

Update: 2025-04-03 06:15 GMT

Prakash Raj: డైలాగ్‌లు చెప్పడం కాదు ప్రజల కోసం పని చేయాలి.. పవన్‌కు ప్రకాశ్‌ రాజ్ పంచ్‌

Prakash Raj: ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జాతీయ అవార్డులు, రాజకీయాలు, సమాజంలో జరుగుతున్న వివిధ అంశాల గురించి మాట్లాడారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పవన్ కల్యాణ్ ప్రజా సమస్యల గురించి ఎంతో స్పష్టంగా, ప్రామాణికంగా మాట్లాడారని గుర్తు చేశారు. అయితే, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు విషయాలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాజకీయాలు సినిమా షూటింగ్‌లు లాంటివి కావని, కేవలం డైలాగ్‌లు చెప్పడం కాకుండా, ప్రజల కోసం నిజంగా పని చేయాలని పవన్‌కు సూచించారు. "ప్రజల సమస్యలను పరిష్కరించకపోతే అధికారంలో ఎందుకు ఉండాలి?" అని ప్రశ్నించారు.

తిరుపతి లడ్డూ వివాదంపై ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ, తాను సనాతన ధర్మానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ఆ అంశం ఎంతో సున్నితమైనదని, భక్తుల మనోభావాలకు సంబంధించినది కాబట్టి, ఇలాంటి విషయాలపై మాట్లాడేటప్పుడు పూర్తి ఆధారాలతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. "లడ్డూ కల్తీ విషయంలో నిజంగానే అవకతవకలు జరిగితే, బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలి" అని అన్నారు.

ఇదిలా ఉంటే పవన్‌పై ప్రకాశ్‌ విమర్శలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఆయనపై విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఆ వ్యాఖ్యలపై అప్పట్లో పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. ప్రకాశ్ రాజ్ తనకు మిత్రుడే అయినప్పటికీ, ఇలాంటి అనవసర విమర్శలు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. మరి ప్రకాశ్‌ రాజ్‌ చేసిన వ్యాఖ్యలపై పవన్‌ ఎలా స్పందిస్తారో చూడాలి. 

Tags:    

Similar News