Prabhas: కన్నడ డైరెక్టర్ తో మూడవ సినిమా సైన్ చేసిన ప్రభాస్?

Prabhas: మరొకసారి అదే డైరెక్టర్ తో పని చేయడానికి రెడీ అవుతున్న ప్రభాస్

Update: 2023-04-13 08:50 GMT

Prabhas: కన్నడ డైరెక్టర్ తో మూడవ సినిమా సైన్ చేసిన ప్రభాస్?

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు "కే జి ఎఫ్" ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సినిమా "సలార్". ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ తో పాటు శాండల్ వుడ్ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ మలయాళం నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. జగపతిబాబు కూడా ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.

ఇక ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మొదటి భాగానికి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. అయితే తాజాగా ఇప్పుడు మరొక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. "సలార్" సినిమా రెండు భాగాల తర్వాత ప్రభాస్ మరియు ప్రశాంత్ నీల్ మరొక ప్రాజెక్టు కోసం చేతులు కలపబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని నిర్మించబోతున్నారని తెలుస్తోంది.

ప్రభాస్ మరియు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం తమ కమిట్మెంట్లను పూర్తి చేసుకున్న తర్వాత ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభాస్ చేతిలో ఇప్పటికే చాలా సినిమాలు పెండింగ్లో ఉన్నాయి. ఆది పురుష్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్, రాజా డీలక్స్ సినిమాలు పూర్తి చేసుకున్న తర్వాత ప్రభాస్ మరొకసారి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

Tags:    

Similar News