Prabhas: నా కల నెరవేరింది అంటున్న ప్రభాస్

Prabhas: బాహుబలి తర్వాత వరుసగా ప్యాన్ ఇండియన్ సినిమాలతో బిజీ అయిపోయారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.

Update: 2022-02-19 08:06 GMT

Prabhas: నా కల నెరవేరింది అంటున్న ప్రభాస్

Prabhas: బాహుబలి తర్వాత వరుసగా ప్యాన్ ఇండియన్ సినిమాలతో బిజీ అయిపోయారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. "సాహో" సినిమాతో కాసుల వర్షం కురిపించిన ప్రభాస్ "రాధే శ్యామ్" సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈ సినిమా కాకుండా ప్రభాస్ చేతిలో బోలెడు బడా ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో ఒకటి "ప్రాజెక్ట్ కే". మహానటి ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. దీపికా పడుకొనే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

తాజాగా షూటింగ్ సమయంలో తీసిన కొన్ని ఫోటోలు మరియు వీడియోలను దీపికా పడుకొనే సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. అవి ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. చూస్తూ ఉంటే సినిమాకి సంబంధించిన మొదటి షెడ్యూల్ పూర్తి అయినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ అమితాబచ్చన్ ఫోటో ఒకటి షేర్ చేసి "నా కల ఇన్నాళ్లకు నెరవేరింది. అమితాబచ్చన్ సార్ తో "ప్రాజెక్ట్ కే" షూటింగ్ ఫస్ట్ షాట్ పూర్తి చేసాము" అని చెప్పుకొచ్చారు ప్రభాస్. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.

Tags:    

Similar News