Radhe Shyam Trailer: "రాధే శ్యామ్" ట్రైలర్ అప్పుడే అంటున్న చిత్రబృందం

Radhe Shyam Trailer: ఘనంగా జరగబోతున్న "రాధేశ్యామ్" ప్రీ రిలీజ్ ఈవెంట్

Update: 2021-12-15 12:42 GMT

ఘనంగా జరగబోతున్న "రాధేశ్యామ్" ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫైల్ ఫోటో)

Radhe Shyam Trailer: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న "రాధే శ్యామ్" సినిమా పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఫాంటసీ ప్రేమకథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా లో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. చాలా కాలం తర్వాత ప్రభాస్ నటిస్తున్న ప్రేమకథ ఇది. "జిల్" ఫేమ్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా 14 జనవరి న విడుదల కాబోతోంది. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిత్ర డైరెక్టర్ ఒక లవ్ స్టోరీలా కంటే "రాధేశ్యామ్" చావు బతుకుల మధ్య జరిగే ఒక పార్టీలో ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే.

ఇప్పటిదాకా సైలెంట్గా ఉన్న చిత్రబృందం తాజాగా ఇప్పుడు చిత్ర ప్రమోషన్స్ తో బిజీ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో ఈనెల సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. చాలా కాలం తర్వాత అభిమానులు ప్రభాస్ ని స్టేజ్ మీద చూడబోతున్నారు.

అదే రోజున ప్రీ రిలీజ్ వేడుక లో సినిమాకి సంబంధించిన ట్రైలర్ విడుదల చేయబోతున్నారు దర్శక నిర్మాతలు. టి సిరీస్ మరియు యు.వి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా లో కృష్ణంరాజు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

Tags:    

Similar News