Radhe Shyam Movie: ఫ్రెంచ్ లో కూడా విడుదలకు సిద్ధంగా ఉన్న ప్రభాస్ సినిమా

Radhe Shyam Movie: ప్యాన్ ఇండియన్ భాషలలో విడుదల కాబోతున్న "రాధేశ్యామ్"

Update: 2021-12-31 10:30 GMT

ఫ్రెంచ్ లో కూడా విడుదలకు సిద్ధంగా ఉన్న ప్రభాస్ సినిమా

Radhe Shyam Movie: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న "రాధే శ్యామ్" సినిమా పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఫాంటసీ ప్రేమకథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా లో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. "జిల్" ఫేమ్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా 14 జనవరి న విడుదల కాబోతోంది. టి సిరీస్ మరియు యు.వి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా లో కృష్ణంరాజు, భాగ్య శ్రీ, సచిన్ ఖెడేకర్, తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మరొక పాన్ ఇండియన్ భాషలో కూడా విడుదల కాబోతోంది. ఈ సినిమా ఫ్రెంచ్ లో కూడా జనవరి 14వ తారీకున విడుదలకు సిద్ధం అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఒక పోస్టర్ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అంటే "రాధేశ్యామ్" సినిమా కేవలం భారతీయ భాషల్లో మాత్రమే కాక ఒక ప్యాన్ ఇండియన్ భాషల్లో కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది.

Tags:    

Similar News