Prabhas: హాలీవుడ్లో అడుగుపెట్టబోతున్న ప్రభాస్..?

Prabhas: ప్రస్తుతం "రాధే శ్యామ్" సినిమా పనులతో బిజీగా ఉన్న మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇంకా చాలా బడా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.

Update: 2021-08-31 15:00 GMT

Prabhas: హాలీవుడ్లో అడుగుపెట్టబోతున్న ప్రభాస్..?

Prabhas: ప్రస్తుతం "రాధే శ్యామ్" సినిమా పనులతో బిజీగా ఉన్న మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇంకా చాలా బడా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఒక వైపు ప్రభాస్ కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో "సలార్" సినిమాలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో "ఆదిపురుష్" సినిమాతో ప్రేక్షకులను మైమరపించనున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత ప్రభాస్ నాగ అశ్విన్ దర్శకత్వం లో ఒక ప్యాన్ ఇండియన్ సినిమా చేయబోతున్నారు.

బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ రేంజ్ వున్నట్టుండి చాలా పెరిగిపోయింది. ప్యాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ హాలీవుడ్ లో సైతం అభిమానుల ప్రేమని సొంతం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ ను హాలీవుడ్లో లాంచ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. తాజాగా ఒక నిర్మాణ సంస్థ ప్రభాస్ తో ఒక హై బడ్జెట్ సినిమాని ప్లాన్ చేస్తుందట. ఇది ఒక హారర్ స్టోరీ అని సమాచారం. ఇప్పటిదాకా ప్రభాస్ హారర్ సినిమాల్లో నటించింది లేదు. నిజానికి ప్రభాస్ కు హారర్ సినిమాలు నచ్చవు. తనకు దయ్యం అంటే భయం అని ప్రభాస్ ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పాడు. మరి ఇలాంటి సినిమాకి ప్రభాస్ ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News