Adipurush - Prabhas: "ఆది పురుష్" సినిమా కోసం రామావతారంలో రెబల్ స్టార్

* రాముడి అవతారంలో 60 రోజుల పాటు ప్రభాస్ (ఆర్)

Update: 2021-09-09 11:28 GMT

"ఆది పురుష్" సినిమా కోసం రామావతారంలో రెబల్ స్టార్

Adipurush - Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఒకవైపు తన తదుపరి సినిమా "రాధేశ్యామ్" విడుదలకు సిద్ధమైంది. మరోవైపు ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో "సలార్" సినిమాతో బిజీగా ఉన్నారు. అంతే కాకుండా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం లో "ఆది పురష్" మరియు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో "ప్రాజెక్ట్ కే" సైన్ చేశాడు ప్రభాస్. తాజాగా "ఆది పురష్" సినిమా గురించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కనున్న విషయం అందరికి తెలిసిందే. భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ సినిమా 3డి ఫార్మెట్లో విడుదల కాబోతోంది.

శ్రీరాముడి పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడట. క్రితి సానన్ సీత పాత్రలో అందరిని మెప్పించనుంది. రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ మరియు లక్ష్మణుడిగా సన్నీ సింగ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాముడి అవతారంలో ప్రభాస్ 60 రోజుల పాటు షూటింగ్ చేయబోతున్నారట. దేవ్ దత్త ఈ సినిమాలో హనుమంతుడి పాత్ర లో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టీ సిరీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి సంచిత్ పరంపర సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Tags:    

Similar News