OTT: మరణం చుట్టూ జరిగే కథ.. ఓటీటీలోకి కొత్త సినిమా వచ్చేస్తోంది

OTT: మరణం చుట్టూ కథలతో ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయి. బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని కూడా అందకున్నాయి. ఇలాంటి కాన్సెప్ట్‌తో వచ్చిన బలగం మూవీ ఎంతటి విజయాన్ని నమోదు చేసుకుందే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2025-04-06 05:15 GMT

OTT: మరణం చుట్టూ జరిగే కథ.. ఓటీటీలోకి కొత్త సినిమా వచ్చేస్తోంది

OTT: మరణం చుట్టూ కథలతో ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయి. బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని కూడా అందకున్నాయి. ఇలాంటి కాన్సెప్ట్‌తో వచ్చిన బలగం మూవీ ఎంతటి విజయాన్ని నమోదు చేసుకుందే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇదిలా ఉంటే ఇలాంటి కథాంశంతో వచ్చిన ఓ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఇంతకీ ఏంటా మూవీ ఎందులో స్ట్రీమింగ్ కానుంది? ఇప్పుడు తెలుసుకుందాం.

నటుడు వైభవ్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ నిహారిక ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పెరుసు’. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ఇళంగో రామ్, తన స్వంత చిత్రం ‘టాంటిగో’ (శ్రీలంక మూవీ) ఆధారంగా దీనిని రూపొందించారు. మార్చి 14న కోలీవుడ్‌లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది. కథ, కథనం, మేకింగ్ పరంగా సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు వచ్చాయి.

ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ వేదికపై ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా ఏప్రిల్ 11 నుండి స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులో ఉంటుంది.

ఇంతకీ కథేంటంటే.?

హలసాయం అనే వ్యక్తి గ్రామ పెద్దగా గౌరవం పొందుతుంటాడు. గ్రామంలో ఏ సమస్య వచ్చినా, తన సహచరులతో కలిసి పరిష్కరిస్తూ ఉంటాడు. అయితే ఓ అనుకోని ఘటనలో హలసాయం మరణిస్తాడు. అతడి మృతితో కుటుంబంలో కొత్త సమస్యలు తలెత్తుతాయి. ఆ సమస్యల్ని కుటుంబ సభ్యులు ఎలా ఎదుర్కొన్నారు? తండ్రి అంత్యక్రియలు సజావుగా పూర్తయ్యేలా ఆయన కుమారులు ఏం చేశారు? కుటుంబ గౌరవాన్ని ఎలా కాపాడారు? అన్న వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Tags:    

Similar News