OG Advance Bookings: 'ఓజీ' బుకింగ్స్​ ప్రభంజనం.. రిలీజ్‌కు ముందే రికార్డుల వేట

OG Advance Bookings: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానుల ఎదురుచూపులకు తెరపడింది.

Update: 2025-09-24 06:27 GMT

OG Advance Bookings: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానుల ఎదురుచూపులకు తెరపడింది. ఆయన తాజా చిత్రం 'ఓజీ' రేపు (గురువారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదల కాకముందే, అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో 'ఓజీ' బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. పవన్ మేనియా ఏ స్థాయిలో ఉందో ఈ అడ్వాన్స్ బుకింగ్స్ స్పష్టంగా చాటుతున్నాయి.

'బుక్ మై షో' ప్లాట్‌ఫామ్‌లో 'ఓజీ' టికెట్ల అమ్మకాలు దూకుడుగా సాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లోనే దాదాపు 2.74 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 6.30 లక్షల టికెట్లు అమ్ముడవ్వగా, ఈ జోరు కొనసాగితే వారాంతం నాటికి ఈ సంఖ్య 10 లక్షల మార్కును దాటుతుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

'ఓజీ' బుకింగ్స్ ముఖ్యంగా నైజాం ఏరియాలో ఆల్ టైమ్ రికార్డులను నమోదు చేస్తున్నాయి. ఇటీవల విడుదలైన 'పుష్ప 2' సినిమా ప్రీమియర్ టికెట్ల అమ్మకాలను సైతం 'ఓజీ' బీట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హైదరాబాద్‌లో మంగళవారం రాత్రి ప్రీమియర్ షోల బుకింగ్స్ ప్రారంభం కాగానే నిమిషాల వ్యవధిలోనే హౌస్‌ఫుల్ బోర్డులు పడ్డాయి. ప్రీమియర్ టికెట్ ధర రూ. 800 ఉన్నప్పటికీ అభిమానులు ఏమాత్రం వెనుకాడకుండా టికెట్లు కొనుగోలు చేస్తున్నారు.


Tags:    

Similar News