Hari Hara Veera Mallu: హరి హర వీర మల్లుకు ఊహించని షాక్.. రూ.250 కోట్ల బడ్జెట్ సినిమాకు వచ్చిందిదే?
Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీర మల్లు సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందని అభిమానులు ఎంతో ఆశించారు. కానీ, వారి అంచనాలు తలకిందులయ్యాయి.
Hari Hara Veera Mallu: హరి హర వీర మల్లుకు ఊహించని షాక్.. రూ.250 కోట్ల బడ్జెట్ సినిమాకు వచ్చిందిదే?
Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీర మల్లు సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందని అభిమానులు ఎంతో ఆశించారు. కానీ, వారి అంచనాలు తలకిందులయ్యాయి. ఈ సినిమా మొత్తం కలెక్షన్లు దారుణమైన స్థితికి చేరుకున్నాయి. ముఖ్యంగా, మంగళవారం నాటి వసూళ్లు చూసి నిర్మాతల కళ్లలో ఆందోళన స్పష్టంగా కనిపించింది. ఏకంగా 250 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటివరకు కేవలం రూ.79 కోట్లను మాత్రమే వసూలు చేసింది. గత వారంతో పోలిస్తే ఈ వారం కలెక్షన్లు మరింత దారుణంగా ఉన్నాయి.
'హరి హర వీర మల్లు' సినిమా ప్రీమియర్ షోల నుంచి 12.75 కోట్ల రూపాయలు వసూలు చేయగా, మొదటి రోజు కలెక్షన్ రూ.34.75 కోట్లగా నమోదైంది. ఈ రెండు కలిపితే మొత్తం 47.50 కోట్ల రూపాయలు అవుతుంది. అయితే, ఆ తర్వాత ఐదు రోజుల్లో సినిమా వసూలు చేసింది కేవలం 32 కోట్ల రూపాయలు మాత్రమే. శనివారం, ఆదివారం సినిమాకు కాస్త మంచి కలెక్షన్లు వచ్చినా, ఈ వారం పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది.
సోమవారం (జులై 28) ఈ సినిమా కేవలం 2.1 కోట్ల రూపాయలు వసూలు చేయగా, మంగళవారం (జులై 29) రూ.1.75 కోట్లు మాత్రమే సాధించింది. ఈ రెండు రోజుల్లో కలిపి మొత్తం 3.85 కోట్ల రూపాయల కలెక్షన్ వచ్చింది. రోజులు గడిచే కొద్దీ 'హరి హర వీర మల్లు' కలెక్షన్లు మరింత తగ్గే అవకాశం ఉంది. ఈ శుక్రవారం నాటికి సినిమా షోల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతుందని అంచనా. దీంతో, సినిమా 100 కోట్ల రూపాయల కలెక్షన్ల కలను చేరుకోవడం కష్టమే అనిపిస్తోంది. ఈ విషయం పవన్ కళ్యాణ్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. పవన్ కళ్యాణ్ సినిమాల్లో అంత యాక్టీవ్ గా లేరు. ఇప్పుడు ఇలాంటి పరాజయం ఎదురైతే, ఆయన నటనకు మరింత దూరమయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.