Pawan Kalyan: ఇదెక్కడి పిచ్చి తల్లి..! పవన్ కళ్యాణ్ తాగిన వాటర్ బాటిల్ దాచుకున్న లేడీ ఫ్యాన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎప్పటికప్పుడు పెరుగుతోంది. హరిహరవీరమల్లు సక్సెస్ మీట్‌లో లేడీ ఫ్యాన్ పవన్ తాగిన వాటర్ బాటిల్ దాచుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Pawan Kalyan: ఇదెక్కడి పిచ్చి తల్లి..! పవన్ కళ్యాణ్ తాగిన వాటర్ బాటిల్ దాచుకున్న లేడీ ఫ్యాన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ వైపు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, మరో వైపు హీరోగా సినిమాలతో అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా ఆయన నటించిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం భారీ అంచనాల నడుమ జూలై 23 రాత్రి నుంచే ప్రీమియర్ షోలు ప్రారంభమై, తొలి రోజు నుంచే సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ధర్మం కోసం పోరాడిన వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
సక్సెస్ మీట్‌లో వైరల్ సీన్
సినిమా ప్రమోషన్స్‌కి పవన్ స్వయంగా హాజరై, వరుసగా ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ నిర్వహించారు. మూవీ సక్సెస్ కావడంతో చిత్రయూనిట్ తాజాగా సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ వేడుకలో ఓ ఫన్నీ కానీ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది.
ఓ నటి స్టేజ్‌పైకి వచ్చి పవన్ కళ్యాణ్‌తో ఫోటో దిగింది. అంతే కాదు, ఆనందంతో ఆయనను హగ్ కూడా చేసుకుంది. ఈ సీన్‌లో పవన్ కొంచెం సిగ్గు పడగా, ఆ అమ్మాయి మాత్రం ఉత్సాహంతో ఎగిరిపోయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వాటర్ బాటిల్ క్రేజ్
ఈ ఈవెంట్‌లో ఆ లేడీ ఫ్యాన్ ఓ యూట్యూబ్ ఛానల్‌తో మాట్లాడుతూ, తాను పవన్‌కు వీరాభిమానినని చెప్పింది. అంతేకాదు, పవన్ తాగిన వాటర్ బాటిల్‌ను జాగ్రత్తగా దాచుకున్నానని గర్వంగా చూపించింది. హ్యాండ్ బ్యాగ్‌లో నుంచి ఆ బాటిల్‌ను బయటకు తీసి చూపించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పవన్ అభిమానులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తూ, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.