Oscar 2022: "ఆస్కార్" ఎంపికకి విద్యాబాలన్, ఏక్తాకపూర్ లకు ఆహ్వానం

ఆస్కార్ అవార్డు ఎంపిక కార్యక్రమానికి భారత చలన చిత్ర రంగం నుండి బొద్దుగుమ్మ విద్య బాలన్ మరియు నటి ఏక్తా కపూర్ ఆహ్వానం..

Update: 2021-07-03 07:11 GMT

విద్య బాలన్ ,ఏక్తా కపూర్ ,శోభా కపూర్ (ఫైల్ ఫోటో)

Oscar 2022 Predictions: ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఆస్కార్ అవార్డు ఎంపిక కార్యక్రమానికి భారత చలన చిత్ర రంగం నుండి బాలీవుడ్ బొద్దుగుమ్మ విద్య బాలన్ మరియు ప్రముఖ నటి నిర్మాత ఏక్తా కపూర్ మరియు తన తల్లి శోభ కపూర్ కి ఆహ్వానం అందింది. ఈ మేరకు మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ & సైన్సు యొక్క అకాడమీ యొక్క "క్లాసు అఫ్ 2021" తరపున నూతనంగా పాల్గొంటున్న నటులతో పాటు టాస్క్ మేనేజర్ లు మొత్తంగా 395 మంది పాల్గొననున్న ఈ కార్యక్రమానికి భారత్ నుండి ముగ్గురు మహిళలకి ఆహ్వానం అందింది. అంతే కాకుండా ప్రస్తుతం జరగబోతున్న ఈ కార్యక్రమంలో 43 శాతం మహిళలు ఉండటం గమనార్హం. గతంలో ఈ ఆస్కార్ వోటింగ్ కి భారత సినిమా రంగం నుండి అమితాబ్ బచ్చన్, ప్రియాంక చోప్రా, దీపిక పదుకొనే, సల్మాన్ ఖాన్, ఇర్ఫాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్, అమీర్ ఖాన్ వంటి నటినటులతో పాటు నిర్మాతలు గౌతం గోస్ మరియు దాస్ గుప్తా లు హాజరయ్యారు. గతంలో 819 మందితో జరిపిన ఈ కార్యక్రమానికి ఈ సారి కరోన కారణాల దృష్ట్యా 395 మంది తో మాత్రమే నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది

ఇక ఇప్పటికే "డర్టీ పిక్చర్" సినిమాతో జాతీయ అవార్డు పొందిన విద్య బాలన్ పరిణిత, పా వంటి చిత్రాలల్లో తన నటనతో ఆకట్టుకున్న విద్య బాలన్ తాజాగా అమిత్ మసుర్కర్స్ దర్శకత్వం వహించిన షేర్నీ లో నటించిన ఈ చిత్రం ఇటివలే ఒక ప్రముఖ ఓటిటి ఛానల్ లో విడుదల అయింది. ఇక ఏక్తా కపూర్ "వన్స్ అపాన్ టైం ఇన్ ముంబై" చిత్రాలతో పాటు "డ్రీం గర్ల్" సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంది. ఇక తన తల్లి శోభ కపూర్ నిర్మాతగా ఉడ్తా పంజాబ్, డర్టీ పిక్చర్ వంటి చిత్రాలని నిర్మించింది. 

Tags:    

Similar News