Moneyshe: నోయల్‌ చెప్పిన శుభవార్త ఏంటంటే..?

నోయల్‌ ‘ఓ ఎగ్జైటింగ్ న్యూస్ మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను’అని రెండు రోజుల క్రితం ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే.

Update: 2021-06-09 15:45 GMT

నోయల్ (ఫొటో ట్విట్టర్)

Moneyshe: ర్యాపర్, 'బిగ్‌బాస్‌'ఫేమ్‌ నోయల్‌ 'ఓ ఎగ్జైటింగ్ న్యూస్ మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను'అని రెండు రోజుల క్రితం ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఇది కచ్చితంగా పెళ్లి గురించే అని భావించారు నెటిజన్లు. అయితే తాజాగా ఆ న్యూస్‌ను రివీల్ చేసి షాకిచ్చాడు నోయల్.

నోయల్ హీరోగా రాబోతోన్న కొత్త సినిమా ఫస్ట్‌లుక్‌ని ట్విట్టర్ లో విడుదల చేశాడు. 'మనీషి' అనే టైటిల్ తో రానున్న ఈ సినిమాతో హీరోగా నోయల్ ఎంట్రీ ఇవ్వబోతోన్నాడు. ఈ సినిమాలో పూజిత పొన్నాడ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మేరకు విడుదల చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటుంది. స్పార్క్ ఓటీటీలో జూన్ 18 నుంచి స్ట్రీమింగ్‌ కానుందని ప్రకటించాడు. ఈ సినిమాకి వినోద్ నాగుల దర్శకత్వం వహించారు. సత్యనారాయణ నాగుల నిర్మించారు.


Tags:    

Similar News