OTT: IMDbలో 8.9, బుక్‌మైషోలో 9.3 రేటింగ్.. ఓటీటీలోకి వచ్చేసిన ఇంట్రెస్టింగ్ మూవీ
OTT: చిమటా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిన చిత్రం ‘నేను-కీర్తన’, చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్) హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించారు.
OTT: IMDbలో 8.9, బుక్‌మైషోలో 9.3 రేటింగ్.. ఓటీటీలోకి వచ్చేసిన ఇంట్రెస్టింగ్ మూవీ
OTT: చిమటా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిన చిత్రం ‘నేను-కీర్తన’, చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్) హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించారు. చిమటా లక్ష్మీ కుమారి నిర్మించిన ఈ సినిమాను చిమటా జ్యోతిర్మయి (USA) సమర్పించారు. థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
గతేడాది ఆగస్టు 30న థియేటర్లలో విడుదలైన ‘నేను-కీర్తన’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. తాజాగా ఈ చిత్రం ఏప్రిల్ 16 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. రూ.99 రెంట్‌తో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు ఓటీటీలోనూ మంచి స్పందన లభిస్తోంది. తక్కువ సమయంలోనే ఈ మూవీ పెద్ద సంఖ్యలో వ్యూస్‌ను రాబట్టడం విశేషం.
లవ్, సెంటిమెంట్, యాక్షన్, రొమాన్స్, కామెడీ, హర్రర్ వంటి అన్ని ఎలిమెంట్స్ ఉన్న ఈ సినిమా కథ గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. చిత్రంలో జానీ పాత్రలో రమేష్ బాబు తన అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. అన్యాయాల్ని ఎదిరించే యువకుడిగా, అవసరంలో ఉన్నవారికి సాయం చేసే వ్యక్తిగా పాత్రలో జీవించారు. ఓ దశలో శత్రువులతో పోరాటానికి దిగాల్సిన పరిస్థితి వస్తుంది. అదే సమయంలో జానీ జీవితంలో కీర్తన ప్రవేశిస్తుంది. స్నేహంగా మొదలైన వారి సంబంధం ప్రేమగా మారుతుంది. ఆ తర్వాత కీర్తన ప్రమాదంలో ఉన్న సంగతి జానీకి తెలిసి, ఆమెను రక్షించేందుకు ఏం చేశాడన్నదే ఈ సినిమా కథ.
కథలో హర్రర్ ఎలిమెంట్స్, అనూహ్య మలుపులతో నిండిన సెకండాఫ్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటుంది. కుల్లు-మనాలిలో చిత్రీకరించిన సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్‌గా నిలిచాయి. రిషిత, మేఘన హీరోయిన్లుగా మంచి నటన కనబరిచారు. అలాగే రేణు ప్రియా, సంధ్య, జీవా, విజయ్ రంగరాజ్, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ సన్నీ తదితరులు ఇతర పాత్రల్లో మెప్పించారు. ఈ చిత్రానికి IMDbలో 8.9, బుక్‌మైషోలో 9.3 రేటింగ్‌లు లభించడం విశేషం.