Ne Zha 2: ఒకే మూవీ రూ. 19వేల కోట్లు.. 2025లో అత్యధిక వసూల్లు చేసిన సినిమా ఇదే..!!
Ne Zha 2: ఒకే మూవీ రూ. 19వేల కోట్లు.. 2025లో అత్యధిక వసూల్లు చేసిన సినిమా ఇదే..!!
Ne Zha 2: 2025 సంవత్సరంలో ప్రపంచ సినిమా రంగంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఒక యానిమేషన్ మూవీ చరిత్ర సృష్టించింది. హాలీవుడ్ భారీ సినిమాలను కూడా వెనక్కి నెట్టి.. చైనా నుంచి వచ్చిన నే ఝా–2 ప్రపంచ బాక్సాఫీస్‌ను షాక్‌కు గురి చేసింది. ఈ సినిమా జనవరి 2025లో విడుదలై, కేవలం కొన్ని నెలల్లోనే రూ.19 వేల కోట్లకు పైగా వసూళ్లు సాధించడం విశేషం.
నే ఝా–2 చైనీస్ మైథాలజీ ఆధారంగా రూపొందించిన ఫాంటసీ అడ్వెంచర్ యానిమేషన్ మూవీ. విధిని ఎదిరిస్తూ తనకే విధించిన శాపాన్ని సవాల్ చేసే ఓ బాలుడి కథను ఈ చిత్రం చూపిస్తుంది. భావోద్వేగాలు, యాక్షన్, విజువల్ ఎఫెక్ట్స్, లోతైన సందేశంతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొదటి భాగమైన ‘నే ఝా’కు కొనసాగింపుగా వచ్చిన ఈ సీక్వెల్, కథా పరంగా మరింత బలంగా నిలిచింది.
ఈ చిత్రాన్ని తొలుత మాండరిన్ భాషలో రూపొందించగా.. తర్వాత ఇంగ్లిష్.. హిందీ సహా పలు భాషల్లో డబ్బింగ్ చేసి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. దీంతో చైనా మార్కెట్‌తో పాటు అమెరికా, యూరప్, ఆసియా దేశాల్లోనూ ఈ మూవీకి భారీ స్పందన లభించింది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు, పిల్లలతో పాటు పెద్దల్ని కూడా ఈ కథ బాగా ఆకట్టుకుంది.
అద్భుతమైన యానిమేషన్ టెక్నాలజీ, గ్రాఫిక్స్, సంగీతం సినిమాకు ప్రధాన బలంగా మారాయి. చైనా సినిమా పరిశ్రమ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిన చిత్రంగా ‘నే ఝా–2’ నిలిచింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఇది ఇప్పటికే బాక్సాఫీస్ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.