Nayanthara: ప్రముఖ నటి లేడీ సూపర్ స్టార్ నయనతార.. తన భర్త విఘ్నేష్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ మాజీ అల్లుడు ధనుష్ తో జరిగిన గొడవల కారణంగా ఈ మధ్య నయనతార సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెడుతున్నారు. ఎక్కడ చూసిన ధనుష్, నయనతార చర్చే నడుస్తోంది. ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విఘ్నేష్ ను పెళ్లి చేసుకోకుంటే బాగుండేది అంటూ నయనతార చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
తన కారణంగా విగ్నేష్ ప్రతిభను గుర్తించడం లేదని ఆమె అన్నారు. తాను ఆయన జీవితంలో లేకపోతే డైరెక్టర్, రచయిత,గేయ రచయితగా ఆయనకు గుర్తింపు దక్కేదని ఆమె చెప్పారు. ఇవన్నీ ఆలోచిస్తే ఒక్కోసారి విగ్నేష్ ను పెళ్లి చేసుకోకుంటే బాగుండేదని అనిపిస్తుందని ఆమె ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.తమ వివాహబంధంలోకి ఆయనను లాగినందుకు అప్పుడప్పుడు గిల్టీగా పీలవుతున్నానని ఆమె వివరించారు.
విగ్నేష్ చాలా మంచి మనిషి. మనస్సున్న వ్యక్తి. తనకు కూడా మంచితనం ఉందన్నారు. కానీ, ఆయనంతా మంచితనం తనలో లేదని ఆమె అన్నారు. తమ రిలేషన్ కోసం మొదటి అడుగు తానే వేశానని ఆమె గుర్తు చేసుకున్నారు.కెరీర్ పరంగా తాను విఘ్నేష్ కంటే సీనియర్. అతను తన కన్న చాలా ఆలస్యంగా కెరీర్ ప్రారంభించారు. తాను కెరీర్ లో సక్సెస్ అయ్యానని ఆమె అన్నారు. కానీ, విగ్నేష్ తన స్థానం సంపాదించుకునే ప్రయత్నంలో ఉన్నారని ఆయన అన్నారు.వరుసగా బ్లాక్ బ్లస్టర్ ఇవ్వలేదని.. తన సినిమాలు వస్తున్నాయని చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారని, చులకన భావంతో మాట్లాడుతున్నారని ఆమె ఆవేదన చెందారు.
ఎవరైనా సరే జీవితంలో విజయం సాధిస్తే తమ కంటే పై స్థాయిలో ఉన్నవారిని ప్రేమించాలని అనుకుంటారన్నారు. ఇక్కడ డబ్బు, లగ్జరీని ఎంచుకోవడం ప్రేమ కాదు.. ప్రేమను పంచుకోవడమే ముఖ్యమని ఆమె వివరించారు.