Posani Krishna Murali: ప్రతిభకే నంది అవార్డు..పైరవీలకు తావులేదు
Posani Krishna Murali: నాటకాల ప్రదర్శన స్థావరాలకే జ్యూరీ టీమ్
Posani Krishna Murali: ప్రతిభకే నంది అవార్డు..పైరవీలకు తావులేదు
Posani Krishna Murali: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నంది అవార్డును ప్రదాన చేసేందుకు చర్యలు తీసుకుందని ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని క్రిష్ణమురళి తెలిపారు. ఈ సంవత్సరంనుంచి నంది అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. ప్రాథమికంగా పద్యనాటకాలకు నంది అవార్డును ప్రధానం చేస్తామన్నారు.
పద్యనాటకాల్లో ఐదు విభాగాలుగా నిర్వహించి ప్రతిభావంతులను ప్రోత్సహిస్తామని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ విజయకుమార్ తెలిపారు. నంది అవార్డులకు సంబంధించి దరఖాస్తులును స్వీకరించేందుకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఆన్ లైన్లోనూ దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.