బీజేపీ - జనసేన పొత్తుపై స్పందించిన నాగబాబు.. అంబటికి కౌంటర్

జసేసేన -బీజేపీ పొత్తుపై నాగబాబు స్పందించారు. వైసీపీ నేతలపై జనసేన నేత సినీనటుడు నాగబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు

Update: 2020-01-17 04:00 GMT
నాగబాబు ఫైల్ ఫోటో

వైసీపీ నేతలపై జనసేన నేత సినీనటుడు నాగబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజీపీ- జనసేన పార్టీల మధ్య పొత్తు వైసీపీ నేతలు చూడలేకపోతున్నారని అన్నారు. సోషల్ మీడియాలో వేదికగా వైసీపీ ఎమ్మెల్యే అబంటిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలి నుంచి నాగబాబు సోషల్ మీడియాలో రాజధాని రైతలు అంశాలపై వైసీపీ నేతల వ్యాఖ్యలకు కౌటర్ ఇస్తువస్తున్నారు. బీజేపీ-జనసేన పార్టీలు కలిసి పనిచేయాలని గురువారం సమావేశంలో నిర్ణయించాయి.

అయితే దీనిపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి పలు విమర్శలు చేశారు. బీజేపీ పాచిపోయిన లడ్డులు ఇచ్చిందన్న పవన్.. ఇప్పుడు ఏ లడ్డులు ఇచ్చిదని విమర్శించారు. పవన్ కళ్యాణ్‌కు స్థిరత్వం లేదని అంబటి విమర్శించారు. అంబటి వ్యాఖ్యలపై నాగబాబు కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియాలో స్పందించిన నాగబాబు "వైసీపీ పార్టీ మరియు అంబటి గారి దు:ఖాన్ని చూడలేకపోతున్నా " అని పోస్టు చేశారు.

కాగా.. గురువారం సమావేశమైన బీజేపీ-జనసేన పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. విజయవాడలో సమావేశమైన ఇరు పార్టీల నేతలు సమావేశం అయిన సంగతి తెలిసిందే. దేశ, రాష్ట్ర భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయని నేతలు తెలిపారు. షరతుల్లేకుండా తమతో కలిసి పనిచేయడానికి పెద్దమనసుతో పవన్‌ ముందుకొచ్చారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా చెప్పరు.

విభజన తర్వాత ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, సామాజిక న్యాయం సాధించాలన్నా బీజేపీ-జనసేనతోనే సాధ్యమన్నారు. రెండు పార్టీలూ 2024లో అధికారమే లక్ష్యంగా ప్రజావ్యతిరేక నిర్ణయాలపై కలిసి పోరాటం చేస్తామని ప్రకటిచారు. వైసీపీ ప్రభుత్వం నియంతృత్వ వైఖరిపై గతంలో టీడీపీ చేసిన అవినీతిపై కలిసి పోరాడతామని తెలిపిన సంగతి తెలిసిందే.

   

Tags:    

Similar News