రష్యాలో రాశి ఖన్నా తో రొమాన్స్ చేస్తున్న నాగ చైతన్య

Naga Chaitanya- Rashi Khanna: యువ హీరో నాగచైతన్య ఈ మధ్యనే "బంగార్రాజు" సినిమాతో హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన దృష్టి మొత్తం "థాంక్యూ" పైన పెట్టాడు ఈ యువ హీరో.

Update: 2022-02-06 08:33 GMT

రష్యాలో రాశి ఖన్నా తో రొమాన్స్ చేస్తున్న నాగ చైతన్య

Naga Chaitanya- Rashi Khanna: యువ హీరో నాగచైతన్య ఈ మధ్యనే "బంగార్రాజు" సినిమాతో హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన దృష్టి మొత్తం "థాంక్యూ" పైన పెట్టాడు ఈ యువ హీరో. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రష్యాలో జరుగుతుంది. అక్కడ టెంపరేచర్ ఇప్పుడు మైనస్ 12 నుండి 18 దాకా ఉంటుంది. అయినా సరే నాగచైతన్య మరియు రాశి ఖన్నా నిర్మాతలకి డబ్బులు సేవ్ చేయడం కోసం అక్కడే విపరీతమైన చలిలో కష్టపడి షూటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రస్తుతం రష్యా ఎవరైనా అక్కడ సినిమా షూటింగ్ చేస్తే బడ్జెట్ లోని కొంత భాగాన్ని రిటర్న్ ఇస్తోంది. రష్యాలో షూటింగ్ కోసం ఎంత ఖర్చయిందో అందులో 90% అక్కడి ప్రభుత్వం నిర్మాతలకు ఇచ్చేస్తోంది. లండన్, యూకే వంటి దేశాలు కూడా ఇప్పుడు ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నాయి. టూరిజం పెంచడానికి ప్రభుత్వం వారు చేస్తున్న పని ఇది. ఈ నేపథ్యంలోనే పలువురు టాలీవుడ్ నిర్మాణ సంస్థలు కొన్ని పెద్ద సినిమాలను అక్కడే షూటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాయి. అందుకే నాగచైతన్య మరియు రాశి ఖన్నా నిర్మాతల కోసం అక్కడే షూటింగ్ చేస్తున్నారు.

Tags:    

Similar News