జార్జిరెడ్డి ఐడియాలజీ పవన్ కళ్యాణ్‌లో కనిపిస్తుంది : నాగబాబు

Update: 2019-11-13 14:12 GMT
george reddy

ఓయూలో 1969 కాలంలో విప్లవ పంథాను నడిపిన జార్జిరెడ్డి జీవిత కథ ఆధారంగా చిత్రం తెరకెక్కుతుంది. జీవన్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్నఈ చిత్రంలో సందీప్ మాధవ్, సత్యదేవ్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నవంబర్ 15న ప్రి రిలీజ్ ఫంక్షన్ కు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈనెల 22న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ఈ సినిమాపై పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు స్పందించారు. జార్జిరెడ్డి బయోపిక్ చిత్రాల్లో ఓ ట్రెండ్ సృష్టిస్తుందని తెలిపారు. తాను కూడా ఈ చిత్రం విడుదల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నానని తెలిపారు. ఈ విషయాన్నివ్యక్తిగత యూట్యూబ్ చానల్ లో ఓ వీడియోను పోస్టు చేశాడు. జార్జీరెడ్డి ఓ గొప్ప విద్యార్థని, అంతకంటే గొప్ప వీరుడని కొనియాడారు. జార్జీరెడ్డి బ్రతికి ఉంటే సీఎం,పీఎం అయ్యేవాడని పేర్కొన్నారు. మొదట జార్జీరెడ్డి పాత్ర పవన్‌తో, వరుణ‌్‌తోనో చేయించాలని అనుకున్నానని తెలిపారు.

చదవులోనూ జార్జిరెడ్డి చదువులో గొప్పగా రాణించేవాడని, విద్యార్థుల సమస్యల కోసం ఆ రోజుల్లోనే ఇస్రోలో ఉద్యోగం వస్తే వదిలేశాడు. సమాజంలో ఉండి, సమస్యలపై పోరాడాడు. జార్జిరెడ్డి క్యారెక్టర్, అగ్రెసివ్‌నెస్, ఎమోషన్స్ పవన్ కళ్యాణ్‌లో కనిపిస్తాయని తెలిపారు. జార్జిరెడ్డి స్ఫూర్తి పవన్ కళ్యాణ్‌తో ముందుకు వెళ్తుందని నేను అనుకుంటున్నానని నాగబాబు యూట్యూబ్ లో తెలిపారు.  

Tags:    

Similar News