Anchor Rashmi: నా హార్ట్ బ్రేక్ ఒక్కసారే కాదు.. కౌంట్ చేసి చెప్పడం కష్టమే.. బ్రేకప్స్ గురించి బయటపెట్టిన యాంకర్ రష్మీ..
Rashmi Gautam: యాంకర్ రష్మీ అంటే సుడిగాలి సుధీర్.. సుడిగాలి సుధీర్ అంటే రష్మీ.. ఇలా బుల్లితెరపై లవర్స్ జోడీగా పేరుగాంచారు.
Anchor Rashmi: నా హార్ట్ బ్రేక్ ఒక్కసారే కాదు.. కౌంట్ చేసి చెప్పడం కష్టమే.. బ్రేకప్స్ గురించి బయటపెట్టిన యాంకర్ రష్మీ..
Rashmi Gautam: యాంకర్ రష్మీ అంటే సుడిగాలి సుధీర్.. సుడిగాలి సుధీర్ అంటే రష్మీ.. ఇలా బుల్లితెరపై లవర్స్ జోడీగా పేరుగాంచారు. వీళ్ల జోడీకి ఉండే కెమిస్ట్రీతో బాగా పాపులర్ అయ్యారు. జనాలు కూడా వీళ్లను లవ్ బర్డ్స్‌లానే ట్రీట్ చేశారు. వీళ్లిద్దరూ ఎప్పుడైనా పెళ్లి చేసుకోవచ్చని అంతా అనుకున్నారు. అయితే, ఈ మధ్య వీరి జోడీ ఎక్కడా కనిపించడం లేదు. జోడీగా కనిపించడం లేదని వాళ్ల ఫ్యాన్స్ కూడా చాలా హర్ట్ అయ్యారు. ఇలాంటి సమయంలోనే రష్మీ ఓ హార్ట్ బ్రేకింగ్ న్యూస్ చెప్పి, ప్రేక్షకులను అయోమయంలో పడేసింది.
ఓ ఈవెంట్‌లో రష్మీ మాట్లాడుతూ.. 'ప్రతి ఒక్కరి జీవితంలో 16 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు బంధాలు, లవ్ ఫెయిల్యూర్స్ ఉంటూనే ఉంటాయి. నా లైఫ్‌లోనూ వీటి గురించి చెప్పడం కష్టమే' అంటూ సెలవిచ్చింది. ఆమె మాటలు విన్న నెటిజన్స్ యాంకర్ రష్మీపై సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇన్నేళ్లలో బ్రేకప్స్ చాలానే ఉంటాయంటూ మాట్లాడుకుంటున్నారు.
ప్రస్తుతం యాంకర్ రష్మీ 'జబర్దస్త్', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' ప్రోగ్రాంలు చేస్తోంది. బుల్లితెర ప్రోగ్రాంలతోపాటు కొన్ని సినిమాల్లోనూ కనిపిస్తుంది. తాజాగా భోళా శంకర్ సినిమాలో చిరంజీవితో కలిసి ఓ సాంగ్‌లో సందడి చేసింది. కన్నడ సినిమాను తెలుగులో 'బాయ్స్ హాస్టల్' పేరుతో ఆగస్టు 25న రిలీజ్ కాబోతుంది. దీంట్లో గెస్ట్ రోల్ చేసింది.