Mowgli OTT: ఓటీటీలోకి 'మోగ్లీ': 2026లో స్ట్రీమింగ్ అవుతున్న మొదటి తెలుగు సినిమా!
Mowgli OTT: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రోషన్ కనకాల హీరోగా, సాక్షి హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ లవ్ థ్రిల్లర్ చిత్రం ‘మోగ్లీ 2025’ ఓటిటీలోకి వచ్చేసింది.
Mowgli OTT: ఓటీటీలోకి 'మోగ్లీ': 2026లో స్ట్రీమింగ్ అవుతున్న మొదటి తెలుగు సినిమా!
Mowgli OTT: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రోషన్ కనకాల హీరోగా, సాక్షి హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ లవ్ థ్రిల్లర్ చిత్రం ‘మోగ్లీ 2025’ ఓటిటీలోకి వచ్చేసింది. పబ్లిక్ స్టార్ బండి సరోజ్ కుమార్ యాంటీ హీరోగా నటించిన ఈ సినిమాను దర్శకుడు సందీప్ రాజ్ తెరకెక్కించారు. థియేటర్లలో డీసెంట్ హైప్‌తో విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్లు సాధించి తన రన్‌ను పూర్తి చేసుకుంది.
థియేటర్ల తర్వాత ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటిటి ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్ (ETV Win) సొంతం చేసుకుంది. కొత్త ఏడాది కానుకగా జనవరి నెలలో ఈ సినిమాను స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో 2026లో ఓటిటీలో విడుదలైన తొలి తెలుగు సినిమాగా ‘మోగ్లీ 2025’ నిలిచింది.
ఈ చిత్రంలో వైవా హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించగా, సంగీతాన్ని కాల భైరవ అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు. లవ్, సస్పెన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమాను ఈటీవీ విన్‌లో వీక్షించవచ్చు.