రెహమాన్ స్థానం భర్తీ చేయనున్న కీరవాణి

MM Keeravani: యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా హీరోగా నటించిన "జెంటిల్ మెన్" ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Update: 2022-01-25 12:30 GMT

రెహమాన్ స్థానం భర్తీ చేయనున్న కీరవాణి

MM Keeravani: యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా హీరోగా నటించిన "జెంటిల్ మెన్" ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన తొలి సినిమా అది. తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో కూడా అదే టైటిల్‌తో 1993లో విడుదల చేశారు. మొదటి సినిమా అయినప్పటికీ శంకర్ అదిరిపోయే హిట్ అందుకున్నారు. జెంటిల్‌మన్ నిర్మాత కుంజుమోన్ అప్పట్లో సినిమా కోసం భారీగా బడ్జెట్ పెట్టారు. ఏఆర్.రెహమాన్ ఇచ్చిన సంగీతం కూడా సినిమాకు మంచి ప్లస్ అయింది. ఇక బాక్సాఫీస్ వద్ద సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టించింది.

మళ్ళీ పాతికేళ్ల తర్వాత ఈ సినిమా నిర్మాత కుంజుమోన్ అధికారికంగా అదే బ్యానర్ లో సీక్వెల్ ను ప్రకటించారు. శంకర్, అర్జున్, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ లేకుండానే మొదటి పార్ట్ కి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు నిర్మాత. పాన్-ఇండియన్ సినిమాగా రాబోతున్న ఈ సినిమా కి ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందించనున్నట్లు సమాచారం. ముందు కొంచెం సస్పెన్స్ క్రియేట్ చేసినా చివరికి ఎంఎం కీరవాణి సినిమాకి సంగీత దర్శకుడిగా ప్రకటించారు. మొదట్లో అల్లు అర్జున్ లాంటి హీరోను సెలెక్ట్ చేసుకోవాలని అనుకున్నారట ఇప్పుడు మరో పాన్-ఇండియా అప్పీల్ ఉన్న నటుడి కోసం వెతుకుతున్నట్టు సమాచారం.

Tags:    

Similar News