Maruva Tarama: ఫీల్ ది మెలోడీ ఆఫ్ లవ్.. అంచనాలు పెంచేసిన మరువ తరమా మూవీ
Maruva Tarama: ఈ రోజుల్లో యువతరం ఫీల్-గుడ్ ప్రేమ కథలకు బాగా కనెక్ట్ అవుతున్నారు. విభిన్నమైన కథాంశంతో, ఆహ్లాదకరంగా ఉండే అలాంటి ప్రేమ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కూడా సంచలనాలు సృష్టిస్తున్నాయి.
Maruva Tarama: ఈ రోజుల్లో యువతరం ఫీల్-గుడ్ ప్రేమ కథలకు బాగా కనెక్ట్ అవుతున్నారు. విభిన్నమైన కథాంశంతో, ఆహ్లాదకరంగా ఉండే అలాంటి ప్రేమ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కూడా సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఇప్పుడు అలాంటి కోవకే చెంది, సంగీతానికి ప్రాధాన్యతనిచ్చే మరో ప్రేమకథ మరువ తరమా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా ట్యాగ్‌లైన్ ఫీల్ ది మెలోడీ ఆఫ్ లవ్ అనేది యువత హృదయాలను తాకేలా ఉంది.
సిల్వర్ స్క్రీన్ పిక్చర్స్ బ్యానర్‌పై గిడుతూరి రమణ మూర్తి, రుద్రరాజు విజయ్ కుమార్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి చైతన్య వర్మ నడింపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అధ్వైత్ ధనుంజయ హీరోగా నటిస్తుండగా, మత్తు వదలరా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అతుల్య చంద్ర, అవంతిక నల్వా హీరోయిన్లుగా నటిస్తున్నారు. తన కర్లీ హెయిర్ తో ఆకట్టుకునే అతుల్య చంద్ర, మత్తు వదలరాతో పాటు గులు గులు వంటి తమిళ చిత్రాల్లో కూడా నటించింది.
ఆ మధ్య విడుదల చేసిన టైటిల్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. ఆ ఉత్సాహంతో తాజాగా సినిమా ట్రైలర్ కూడా విడుదల చేశారు. ప్రేమలో ఉన్న యువకుడి ఫీలింగ్స్‌ను చూపించే ఈ ట్రైలర్ యువ ప్రేక్షకులను మొదటి చూపులోనే ఆకట్టుకుంటోంది. ట్రైలర్ చూసిన ప్రేక్షకులు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశారు.
మరువ తరమా సినిమా ఈ సంవత్సరం ప్రతి ఒక్కరినీ ప్రేమలో పడేయడానికి వస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేశారు. షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న యూనిట్, ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. ఈ ఫీల్-గుడ్ లవ్ స్టోరీ నవంబర్ 28న థియేటర్లలో విడుదల కానుంది. బేబీ సినిమా పాటలతో వార్తల్లో నిలిచిన విజయ్ బుల్గానిన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ రొమాన్స్ సాగా ఆడియో హక్కులను ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సోనీ మ్యూజిక్ సొంతం చేసుకుంది. రుద్ర సాయి సినిమాటోగ్రాఫర్‌గా, కేఎస్ఆర్ ఎడిటర్‌గా పనిచేశారు. పాటలకు అజయ్ శివ శంకర్ కొరియోగ్రఫీ అందించగా, చైతన్య వర్మ ఆర్ట్ డైరెక్టర్‌గా, హరి వర్మ లిరిసిస్ట్‌గా, పీఆర్వోగా కిలారి సుబ్బారావు వ్యవహరించారు.