March 2026 Box Office Tsunami.. అసలైన బాక్సాఫీస్ సునామీ మార్చిలోనే! ఆరు భారీ చిత్రాల మధ్య 'మహా' యుద్ధం!

2026 మార్చిలో బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్! యష్ 'టాక్సిక్', రామ్ చరణ్ 'పెద్ది', నాని 'ప్యారడైజ్' సహా ఐదు భారీ చిత్రాల రిలీజ్ డేట్స్ మరియు తాజా అప్‌డేట్స్.

Update: 2026-01-19 05:11 GMT

ఈ ఏడాది సంక్రాంతికి భారీ చిత్రాలు పోటీ పడ్డాయి కదా అని మనం మురిసిపోతున్నాం. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'మన శంకరవరప్రసాద్ గారు' కలెక్షన్ల వర్షం కురిపించాయి. కానీ, అసలైన బాక్సాఫీస్ ఫైట్, అంతకు మించిన వసూళ్ల విధ్వంసం మార్చి నెలలో చూడబోతున్నాం. బడ్జెట్ పరంగా, క్రేజ్ పరంగా ఈసారి పోటీ మామూలుగా లేదు!

మార్చి 19: ముక్కోణపు పోరు!

ఒకే రోజు ముగ్గురు పవర్‌ఫుల్ హీరోలు బాక్సాఫీస్ వద్ద తలపడబోతున్నారు.

ధురంధర్ 2 (Dhurandhar 2): రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధార్ తెరకెక్కిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ మార్చి 19న వస్తుందని మేకర్స్ బల్లగుద్ది చెబుతున్నారు. జియో స్టూడియోస్ ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

టాక్సిక్ (Toxic): కన్నడ సూపర్ స్టార్ యష్ నటిస్తున్న 'టాక్సిక్' రిలీజ్ డేట్‌లో ఎలాంటి మార్పు లేదని తెలుస్తోంది. టీజర్ వివాదాలతో సంబంధం లేకుండా బయ్యర్లు ఈ సినిమా కోసం భారీ రేట్లు ఆఫర్ చేస్తున్నారు.

డెకాయిట్ (Dacoit): అడివి శేష్ నటిస్తున్న ప్యాన్ ఇండియా మూవీ 'డెకాయిట్' కూడా అదే రోజు బరిలో ఉంది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడటంతో, ఈసారి ఎలాగైనా థియేటర్లోకి రావాలని అన్నపూర్ణ స్టూడియోస్ ఫిక్స్ అయ్యింది.

మార్చి చివరి వారంలో.. చెర్రీ వర్సెస్ నాని!

మార్చి మూడవ వారంలో మొదలయ్యే ఈ సునామీ, నెలాఖరుకు మరింత ఉగ్రరూపం దాల్చనుంది.

పెద్ది (Peddi): గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న 'పెద్ది' మార్చి 27న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇప్పటికే దర్శకుడు ఈ తేదీని పలుమార్లు కన్ఫర్మ్ చేశారు.

ప్యారడైజ్ (Paradise): నేచురల్ స్టార్ నాని తన 'ప్యారడైజ్' సినిమాతో మార్చి 26నే థియేటర్లలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇప్పటి వరకు వాయిదా గురించి ఎలాంటి వార్తలు లేవు.

ఎందుకు ఈ పోటీ స్పెషల్?

సంక్రాంతికి వచ్చిన సినిమాల స్పాన్ మీడియం రేంజ్‌లో ఉంటే, మార్చిలో వచ్చే సినిమాలన్నీ హై-బడ్జెట్ ప్యాన్ ఇండియా ప్రాజెక్టులే. ఒకవేళ ఈ ఐదు సినిమాలు అనుకున్న తేదీలకే వస్తే.. థియేటర్ల దగ్గర టికెట్ల కోసం పెద్ద యుద్ధమే జరగడం ఖాయం. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం, 2026 మార్చి నెల టాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద వసూళ్ల రికార్డులను తిరగరాయబోతోంది.

Tags:    

Similar News