అవును మేము విడాకులు తీసుకున్నాం : మంచు మనోజ్

ప్రముఖ హీరో మంచు మనోజ్‌ విడాకులు తీసుకున్నారు. తన భార్య ప్రణతిరెడ్డితో విడాకులు తీసుకున్నట్టు ఆయన అధికారికంగా ప్రకటించారు

Update: 2019-10-17 12:21 GMT

ప్రముఖ నటుడు మోహన్ బాబు తనయుడు.. హీరో మంచు మనోజ్‌ విడాకులు తీసుకున్నారు. తన భార్య ప్రణతిరెడ్డితో విడాకులు తీసుకున్నట్టు మనోజ్ ప్రకటించారు. ప్రకటనలో భార్యభర్తలుగా తమ ప్రయాణానికి ముగింపు పలికాం.. విడిపోయినప్పటికీ ఒక్కరంటే మరోకరికి గౌరవం అలాగే ఉంటుంది. అలాగే ఈ సమయంలో తన కుటుంబం ఎంతో అండగా నిలిచిందని పేర్కొన్నారు. తనకు సపోర్ట్‌గా నిలిచిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానని తెలిపారు. చివరి శ్వాస వరకు సినిమాల్లో కొనసాగుతానని మనోజ్ స్పష్టం చేశారు. కాగా, 2015లో మనోజ్‌, ప్రణతిరెడ్డిల వివాహం జరిగింది. అయితే ఏడాది కిందటే వీరిద్దరూ విడిపోయినట్టు వార్తలు వచ్చాయి. అయితే వీటిని వీరు కండించారు కానీ తాజగా ఆ విషయాన్నీ నిజం చేశారు.



Tags:    

Similar News