Malayalam OTT Movies: ఓటీటీలో చూడాల్సిన బెస్ట్ 4 మలయాళం సినిమాలు ఇవే.. హారర్ నుంచి కామెడీ వరకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!
Malayalam OTT Movies: ఈ వారం ఓటీటీలో విడుదల అవుతున్న మిస్ అవ్వకూడని బెస్ట్ 4 మలయాళ సినిమాలు ఇవే
Malayalam OTT Movies: ఓటీటీలో చూడాల్సిన బెస్ట్ 4 మలయాళం సినిమాలు ఇవే.. హారర్ నుంచి కామెడీ వరకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!
Malayalam OTT Movies: ఓటీటీ వచ్చిన తర్వాత మలయాళ సినిమాలకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు లభించింది. తక్కువ బడ్జెట్‌లోనే గట్టి కథలు, సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో మాలీవుడ్ ముందుంటుంది. అందుకే ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు కూడా మలయాళ సినిమాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ వారం ఓటీటీలో విడుదల అవుతున్న మిస్ అవ్వకూడని బెస్ట్ 4 మలయాళ సినిమాలు ఇవే…
1. ఎకో (Eko) – నెట్‌ఫ్లిక్స్‌లో ఉత్కంఠభరిత మిస్టరీ థ్రిల్లర్
థియేటర్లలో మంచి స్పందన పొందిన ‘ఎకో’ ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. కేరళ–కర్ణాటక సరిహద్దుల్లో ఒంటరిగా జీవించే వృద్ధురాలి చుట్టూ తిరిగే మిస్టరీ, ఆమె జీవితంలోకి అనుకోని అతిథులు రావడం, పోలీసులు–తీవ్రవాదుల వేట… కథను ఉత్కంఠభరితంగా నడిపిస్తాయి.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
స్ట్రీమింగ్ తేదీ: డిసెంబర్ 31, 2025 (తెలుగు వెర్షన్ జనవరి 7 నుంచి అవకాశం)
2. నిధియుమ్ భూతవుమ్ – కామెడీతో కూడిన హారర్ థ్రిల్లర్
ముగ్గురు మెకానిక్స్ పాత ఇంట్లో వర్క్‌షాప్ ఏర్పాటు చేయడంతో మొదలయ్యే వింత సంఘటనలే ఈ సినిమా కథ. భయంతో పాటు నవ్వులు పూయించే సన్నివేశాలు ప్రధాన ఆకర్షణ.
ఓటీటీ: సన్ నెక్ట్స్
స్ట్రీమింగ్ తేదీ: డిసెంబర్ 30, 2025
3. ఇతిరి నేరం – ఒక రాత్రి ప్రయాణంలో పాత ప్రేమ జ్ఞాపకాలు
కాలేజీ ప్రేమికులు అనుకోకుండా కలుసుకుని ఒక రాత్రి మాట్లాడుకునే సంభాషణలే ఈ హృద్యమైన ప్రేమ కథ. సహజ భావోద్వేగాలతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఓటీటీ: సన్ నెక్ట్స్
స్ట్రీమింగ్ తేదీ: డిసెంబర్ 31, 2025
4. ఇన్నోసెంట్ – నిజాయితీ కోసం ఒక సామాన్యుడి పోరాటం
ఒక చిన్న అపార్థంతో సమాజం ముందు దోషిగా మారిన క్లర్క్ తన నిర్దోషిత్వాన్ని ఎలా నిరూపించుకున్నాడన్నదే ఈ సినిమా సారాంశం. భావోద్వేగాలు, సామాజిక సందేశంతో కూడిన చిత్రం ఇది.
ఓటీటీ: సైనా ప్లే
స్ట్రీమింగ్ తేదీ: డిసెంబర్ 29, 2025