ఆ సినిమాలో 140 మంది నటులు.. ఎందుకో తెలుసా?

* ఆదుకునేందుకు ముందుకొచ్చిన.. * అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌ "అమ్మ" * 140 మంది సినీ ప్రముఖులతో మూవీకి ప్లాన్‌

Update: 2021-02-08 05:10 GMT

Representational Image

ఓ టాప్ హీరో సినిమా రూపొందుతుందంటే ఆ సినిమాకు క్రియేట్ అయ్యే బజ్ ఏంటో మన అందరికీ తెలిసిందే. అలాంటిది ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 140 మంది స్టార్స్ తో ఓ మూవీ నిర్మాణం అవుతోంది. ఇంతకీ ఎవరెవరు నటిస్తున్నారు?

దేశంలో ఎక్కడ ఏ విపత్తు జరిగినా సినీ ప్రముఖులు తమవంతు సాయం చేస్తుంటారు. అలాంటిది కరోనా కారణంగా షూటింగ్స్‌ ఆగిపోయి, థియేటర్స్‌ మూతపడటంతో సినీ కార్మికులు కష్టాల్లో పడ్డారు. అలాంటి వారికి అండగా నిలబడాలని, సహాయం అందించాలని 'అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌' (అమ్మ) నిర్ణయించుకుంది. అందులో భాగంగా ఓ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్‌ చేస్తోంది. ఈ సినిమాలో నటించేందుకు టాప్ స్టార్స్ కూడా ముందుకు వచ్చారు.

ఈ చిత్రంలో మోహన్‌లాల్‌, మమ్ముట్టి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వీరితో పాటు మలయాళ చిత్రసీమలోని సుమారు 140 మంది ఈ సినిమాలో నటించబోతున్నారని సమాచారం. ఈ ఏడాది మధ్యలో ప్రారంభించి.. వచ్చే ఏడాది ప్రారంభంలో సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా ద్వారా వచ్చే మొత్తాన్ని సినీ కార్మికులకు సాయం అందించేందుకు ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News