Rajamouli - Mahesh: అప్పుడే పట్టాలు ఎక్కనున్న మహేష్ బాబు జక్కన సినిమా

Update: 2021-08-12 11:07 GMT

Rajamouli - Mahesh Babu: (Photo: The Hans India)

Rajamouli - Mahesh Babu Movie: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం "సర్కారు వారి పాట" సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా కూడా పూర్తయిన తరువాత మొట్టమొదటిసారిగా జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా పట్టాలు ఎక్కనుంది. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమాకి స్క్రిప్ట్ అందించిన విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా మొత్తం ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ తో సాగుతుందనే విషయాన్ని రివీల్ చేశారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళుతుందని అభిమానులు అందరూ ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు వచ్చే ఏడాది సమ్మర్ లోపు త్రివిక్రమ్ సినిమా షూటింగ్ పూర్తి చేయనున్నారు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు రాజమౌళి చిత్రం సమ్మర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈలోపు రాజమౌళి కూడా తన తదుపరి సినిమా అయిన "ఆర్ ఆర్ ఆర్" ను పూర్తిచేసి త్వరలో విడుదల చేయనున్నారు.

Tags:    

Similar News