Mahesh- Venkatesh: పెద్దోడి కోసం చిన్నోడు.. సంక్రాంతి పార్టీలో సందడి చేసిన మహేష్

Mahesh- Venkatesh: సంక్రాంతి కానుకగా ఈనెల 14న విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా మంచి టాక్ తెచ్చుకుంది.

Update: 2025-01-18 08:51 GMT

Mahesh- Venkatesh: పెద్దోడి కోసం చిన్నోడు.. సంక్రాంతి పార్టీలో సందడి చేసిన మహేష్

Mahesh- Venkatesh: సంక్రాంతి కానుకగా ఈనెల 14న విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా టీమ్ ఏర్పాటు చేసిన పార్టీలో మహేష్ బాబు సందడి చేశారు. చిత్ర బృందంతో మహేష్ దిగిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

వెంకటేష్, మహేష్ మధ్య ఉన్న రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరూ కలిసి సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో నటించారు. ఆ సినిమాలో చిన్నోడు, పెద్దోడిగా వారి క్యారెక్టర్లు అందరినీ ఆకట్టుకున్నాయి. అప్పటి నుంచి చిన్నోడు, పెద్దోడుగా ఆ పేర్లు స్థిరపడి పోయాయి. ఎక్కడ కనిపించినా అదే పేర్లతో అభిమానులు పిలుచుకుంటున్నారు. ఒకరి సినిమాకు ఒకరు సపోర్ట్ ఉంటారు. తాజాగా వెంకటేష్ టీమ్‌తో కలిసి మహేష్ కుటుంబం సరదాగా గడిపింది.మహేష్ సతీమణి నమ్రతా శిరోద్కర్, నిర్మాత సురేష్ బాబు, మెహర్ రమేష్ తదితరులు పార్టీకి హాజరయ్యారు. వెంకటేష్, మహేష్ ఒకే చోట కనిపించే సరికి వారి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో కలిసి నటించిన మహేష్, వెంకటేష్ పాత్రలను ఉద్దేశిస్తూ ఒకే ఫ్రేమ్ లో చిన్నోడు, పెద్దోడు అదుర్స్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ సినిమా తనకు ఎంతో నచ్చిందని మహేశ్ బాబు ఇటీవల ట్వీట్ చేశారు. ఇది అసలైన పండుగ సినిమా అని తెలిపారు. వెంకటేష్, హీరోయిన్లు ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షి చౌదరి, బుల్లిరాజు పాత్ర పోషించిన బాలుడి నటన అద్బుతమని కొనియాడారు. ఎఫ్2, ఎఫ్3 తర్వాత వెంకటేష్ హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రమిది. విడుదలైన మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.106 కోట్లు వసూళ్లు సాధించింది.

ఇదిలా ఉంటే రాజమౌళి తెరకెక్కించబోతున్న SSMB29లో మహేష్‌కు అన్నగా మరోసారి వెంకటేష్ నటించబోతున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. దీంతో మరోసారి వీరిద్దరూ తెరపై కనిపించనున్నారని వారి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ సినిమాకు సంబంధించి ఎటువంటి సమాచారం ఇప్పటివరకు బయటకు రాలేదు.


Tags:    

Similar News