Mahesh Babu: ఆలస్యం చేస్తూ సినిమాలు పోగొట్టుకుంటున్న మహేష్ బాబు

* చేజేతులా సినిమాలు పోగొట్టుకుంటున్న స్టార్ హీరో

Update: 2023-03-06 16:00 GMT

Mahesh Babu: ఆలస్యం చేస్తూ సినిమాలు పోగొట్టుకుంటున్న మహేష్ బాబు 

Mahesh Babu: ఇండస్ట్రీలో చిటికెలో నిర్ణయాలు తీసుకునే పెద్ద పెద్ద స్టార్ హీరోలు కొంతమంది ఉన్నారు. అందులో మొదటిగా వినిపించే పేరు సూపర్ స్టార్ రజినీకాంత్. కొంతమంది సినిమాల విషయంలో ఓకే చేయడానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటారు. ఎంత ఎక్కువ సమయం అంటే కొన్ని కొన్ని సార్లు ఆ సినిమాలు కూడా వాళ్ల చేతుల్లోంచి చేజారి పోతూ ఉంటాయి. అలాంటి ఒక హీరో మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.

"కే జి ఎఫ్" సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత ఈ సినిమాకి దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ కి మహేష్ బాబు స్వయంగా ఫోన్ చేసి అతనితో కలిసి డిన్నర్ కూడా చేశారు. వీరిద్దరి కొలాబరేషన్ కి ప్రయత్నాలు కూడా జరిగాయి కానీ అవి వర్కౌట్ అవ్వలేదు. ఇక ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మరియు ప్రభాస్ లతో సినిమాలు సైన్ చేసేసారు. ఇక "అర్జున్ రెడ్డి" సినిమా సూపర్ హిట్ అయిన వెంటనే మహేష్ బాబు సందీప్ రెడ్డి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయాల్సింది కానీ ఆ విషయంలో కూడా మహేష్ బాబు బాగా లేట్ చేసేసారు. ఇక సందీప్ వంగా బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయారు.

ఇప్పుడు ప్రభాస్, అల్లు అర్జున్ వంటి మిగతా ప్యాన్ ఇండియా స్టార్లతో సినిమాలు లైన్లో పెట్టేశారు. అయితే మరి కొందరు డైరెక్టర్లు మాత్రం మహేష్ బాబు కోసం సంవత్సరాలు వెయిట్ చేశారు. "పుష్ప" సినిమాని మొదలు పెట్టడానికి ముందు మహేష్ బాబు కోసం సుకుమార్ సంవత్సరం పాటు ఎదురు చూశారు. శేఖర్ కమ్ముల కూడా రెండు సంవత్సరాల పాటు వెయిట్ చేశాకే ధనుష్ తో సినిమాని మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు ఇలానే తన సినిమాల విషయంలో లేట్ చేస్తూ ఉంటే కొన్ని బ్లాక్ బస్టర్ ప్రాజెక్టులు కూడా చేజారిపోయే అవకాశాలు ఉన్నాయని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Tags:    

Similar News