వరుణ్‌ తేజ్‌తో పెళ్లి..? ఫొటోతో క్లారిటీ ఇచ్చిన..

Lavanya Tripathi: మెగా హీరో వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాటి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఈ మధ్య వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

Update: 2022-01-20 11:56 GMT

వరుణ్‌ తేజ్‌తో పెళ్లి.. ఫొటోతో క్లారిటీ ఇచ్చిన..

Lavanya Tripathi: మెగా హీరో వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాటి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఈ మధ్య వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తన పుట్టినరోజు సందర్భంగా వరుణ్ తేజ్ ఆమెను కలవడానికి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ పుకార్లకు సమాధానం ఇచ్చింది లావణ్య. మిస్టర్ మరియు అంతరిక్షం సినిమాలో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్గా నటించింది లావణ్య త్రిపాటి. అప్పట్లో వెండితెరపై వీరి కెమిస్ట్రీ చూసి వీరు నిజజీవితంలో కూడా ప్రేమలో ఉన్నారని పుకార్లు పుట్టుకొచ్చాయి.

ఇక వరుణ్ తేజ సోదరి నిహారిక పెళ్లి కి కూడా లావణ్య రావడంతో ఆ వార్తలు మరింత అందుకున్నాయి. ఆ తర్వాత వీరి గురించి ఎలాంటి వార్తలు బయటకు రాకపోగా తాజాగా మళ్లీ వరుణ్ తేజ్ లావణ్య కోసం బెంగళూరు వెళ్లారని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇన్డైరెక్ట్ గా రియాక్ట్ అవుతూ తన కుటుంబ సభ్యులతో కలిసి తాను డెహ్రాడూన్ ఉన్నట్లుగా కొన్ని ఫోటోలను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. దీంతో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాటి కోసమే బెంగళూర్ వెళ్లారని పుకార్లకు చెక్ పడింది.



 


Tags:    

Similar News