Kingdom Postponed: మళ్లీ వాయిదా?.. విజయ్ దేవరకొండకు మోక్షం ఎప్పుడు?
విజయ్ దేవరకొండ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘కింగ్‌డమ్’ మళ్లీ వాయిదా పడే పరిస్థితుల్లో ఉంది.
Kingdom Postponed: మళ్లీ వాయిదా?.. విజయ్ దేవరకొండకు మోక్షం ఎప్పుడు?
Kingdom Postponed: ‘కింగ్‌డమ్’ మళ్లీ వాయిదా?.. విజయ్ దేవరకొండకు మోక్షం ఎప్పుడు?
విజయ్ దేవరకొండ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘కింగ్‌డమ్’ మళ్లీ వాయిదా పడే పరిస్థితుల్లో ఉంది. మే 30న థియేటర్లలోకి రావాల్సిన ఈ సినిమా ముందుగా జూలై 4కి పోస్ట్‌పోన్ అయింది. కానీ తాజా సమాచారం ప్రకారం ఆ తేదీకి కూడా విడుదల కావడం కష్టమేనని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడంతో నిర్మాతలు జూలై 25న విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.
అయితే అదే రోజున మెగా ప్రాజెక్ట్ ‘విశ్వంభర’ రిలీజ్ టార్గెట్ చేసుకోవడం వల్ల మరోసారి డేట్ మారే అవకాశం కనిపిస్తోంది. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కి మరోసారి నిరాశ ఎదురవుతుంది.
ఇప్పటికే లైగర్, ఫ్యామిలీ స్టార్ సినిమాలతో పరాజయాలను ఎదుర్కొన్న విజయ్ తన ఫ్యూచర్‌ను ‘కింగ్‌డమ్’పై ఆధారపెట్టాడు. కానీ ఈ సినిమా వాయిదాలు, ఆలస్యం అభిమానుల ఆతృతను మరింత పెంచుతున్నాయి. సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న విజయ్‌కి ఈసారి అయినా “మోక్షం” లభిస్తుందా అన్నది చూడాలి!