డైలాగ్ వస్తే చాలు 'కేజీయఫ్‌ 2' లో నటించచ్చు

Update: 2019-04-22 11:12 GMT

కన్నడ సినీ చరిత్రలో సంచలన విజయం సాధించిన హై బడ్జెట్ సినిమా 'కేజీయఫ్‌'. యువ హీరో యష్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా కన్నాడలోనే కాక తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ అయిన 'కేజీయఫ్: చాప్టర్ 2' పనులు మొదలుపెటింది చిత్రబృందం. ఈ చిత్ర షూటింగ్ ఈమధ్యనే ప్రారంభించారు. అయితే 'కేజీయఫ్ 2' లో నటీనటులు కోసం ఆడిష‌న్స్‌ జరుగుతున్నాయి. ఇందులో పాల్గొన‌వ‌చ్చని చిత్రయూనిట్ ఓ పోస్టర్‌ ద్వారా తెలియచేశారు.

8 నుండి 16 సంవ‌త్సరాల వ‌య‌స్సున్న పిల్లలు, 25 సంవత్సరాల పైబ‌డిన పురుషులు కావాలని ఈ ప్రకటన సారాంశం. కానీ ఆడిష‌న్‌కి వ‌చ్చే ముందు కనీసం నిమిషం నిడివి ఉన్న ఏదైనా డైలాగ్‌ని నేర్చుకొని రావాల‌ని షరతు పెట్టారు. ఈ ఆడిషన్స్‌ బెంగళూరులోని జీఎమ్‌ రిజాయిజ్‌లో ఏప్రిల్‌ 26న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు జరగబోతోంది. ఆసక్తి ఉన్నవాళ్లు డైలాగ్ నేర్చుకుని వెళ్లచ్చు. ఈ సినిమాలో బాలీవుడ్ నటులు సంజయ్‌ దత్‌, రవీనా టండన్‌, ఉపేంద్ర లు 'కేజీయఫ్‌ 2' లో కనిపించబోతున్నారు. 




 


Similar News