తల్లి పాత్రలో నటించనున్న కీర్తి సురేష్ (ఫైల్ ఇమేజ్)
Keerthi Suresh: ప్రముఖ సినీనటి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఈనెల 12వ తేదీన ఘనంగా జరగనుంది. ఇందుకు సంబంధించిన వెడ్డింగ్ కార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నటి కీర్తి సురేశ్ డిసెంబర్ 12వ తేదీన ఆంటోనీ థట్టిల్ ను పెళ్లాడనుంది. పెళ్లి సమయం దగ్గర పడుతున్న సమయంలో పెళ్లి కార్డు సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. కీర్తి సురేశ్ పెళ్లి కార్డు చాలా అందంగా ఉంది. ఆమె ఫ్యాన్స్ అద్భుతంగా ఉందంటూ కామెంట్స్ సైతం పెడుతున్నారు. కీర్తి సురేశ్ పెళ్లి కార్డు సోషల్ మీడియాలో హాట్ టాపిగ్గా మారింది.
వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డు ప్రకారం కీర్తి సురేశ్ డిసెంబర్ 12వ తేదీన పెళ్లి చేసుకుంటున్నారు. ఆహ్వాన పత్రికలో కీర్తి సురేశ్ పేరేంట్స్ జి సురేశ్ కుమార్, మేనక సురేశ్ ల సంతకం కూడా ఉంది.
ఇక మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం కీర్తి పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఆంటోనీ థట్టిల్ దుబాయ్ కు చెందిన బిజినెస్ మెన్. అతను కొచ్చిలో రిసార్ట్స్ నడుపుతున్నాడు. వ్యాపారంలో మంచి పేరుతోపాటు అనుభవం కూడా ఉందట. ఈ మధ్యే కీర్తి థట్టిల్ తో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తమ 15ఏళ్ల బంధమని చెప్పుకొచ్చారు.