కార్తీక దీపం సీరియల్ 'దీప' రియల్ భర్త ఎవరో తెలుసా ?

Update: 2019-10-28 13:57 GMT

స్టార్ మా చానల్ లో ప్రసారమయే కార్తీక దీపం సీరియల్ అంటే తెలియని వారు బహుశా ఉండరేమో .. రాత్రి ఏడున్నర సమయం అయిందంటే ఇంటిల్లి పాది వచ్చి టీవీలకి అతుక్కుపోతారు. అంతగా ఈ సీరియల్ కి అడిక్ట్ అయ్యారంటే అతిశయోక్తి కాదు ..  ఈ సీరియల్ తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. ప్రస్తుతం సీరియల్స్ అన్నింటిని వెనుకకి నెట్టేసి టాప్ టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతుంది. ఈ సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకి ప్రేమి విశ్వనాధ్ అనే నటి పరిచయం అయింది. దీపగా ఈ సీరియల్ లో నటిస్తుంది. స్వతహాగా మలయాళీ అయిన ప్రేమి అతి కొద్దికాలంలోనే తెలుగు నేర్చుకొని అచ్చ తెలుగు అమ్మాయిగా మారిపోయింది.

 ప్రేమి విశ్వనాధ్ 1991 డిసెంబర్ 2 న కేరళ లోని ఎర్నాకుళంలో జన్మించింది. ఆమె తండ్రి విశ్వనాధ్. తల్లి కాంచన.. ఈమెకి ఓ సోదరుడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం వీరంతా కేరళలో ఉంటున్నారు. నటనపైన ఉన్న ఆసక్తితో అక్కడ కొన్ని సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక కొన్ని సంవత్సరాల కింద ప్రేమి విశ్వనాధ్ వినీత్ భట్ ని వివాహం చేసుకుంది. వినీత్ భట్ కేరళలోని గొప్ప జ్యోతిష్యుడుగా పేరు సంపాదించుకున్నారు. బెస్ట్ ఆస్ట్రాలేజర్ ఆఫ్ ది వరల్డ్ అనే అవార్డు అందుకున్నారు. ఇక ప్రేమికి భర్త ప్రోత్సాహం కూడా ఉండడంతో తన ఫ్యాషన్ ని కెరియర్ గా మలుచుకొని మంచి నటిగా కొనసాగుతుంది.  



 


Tags:    

Similar News